బ్రౌన్ రైస్ ,గోధుమలు వంటి తృణధాన్యాలు తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ ఫినోలిక్ ఆమ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కాలేయం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాలేయానికి క్యాన్సర్ వంటివి రాకుండా కూడా కాపాడుతుందట.
చేపలు, పౌల్ట్రీ వంటి వాటిలో లిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కామెర్లు సైతం రాకుండా అడ్డుకుంటాయి. వీటిని కామెర్ల బారిన పడ్డవారు కూడా తినవచ్చు.
కామెర్ల వచ్చినవారు వేయించిన ఆహార పదార్థాలు కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను అసలు ముట్టుకోకూడదు. ఇలాంటి ఆహార పదార్థాలు తింటే కాలేయం త్వరగా ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం కష్టంగా మారుతుందట.
పచ్చ కామర్ల సమస్య ఉన్నవారు రోజుకి కనీసం ఐదు లీటర్ల నీటిని తాగుతూ ఉండాలి.. ఇలా తాగడం వల్ల పచ్చ కామర్ల సమస్య తగ్గడానికి తక్కువ సమయం పడుతుంది. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయని ఇటీవలే ఒక పరిశోధనలు తేలింది. సగటు మనిషి రోజుకి ఐదు నుంచి 8 లీటర్ల నీటిని తాగడం మంచిది.
తాజా పండ్లు కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పచ్చ కామర్ల సమస్య తగ్గించుకోవచ్చు.. ముఖ్యంగా బెర్రీ జాతికి చెందిన బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష పండ్లను తీసుకోవడం మరింత మంచిదంటూ నిపుణులు తెలియజేస్తున్నారు.