మన చుట్టూ దొరికేటువంటి పండ్లు , కాయగూరలలో మనకు తెలియని ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా కీరదోస గురించి తెలిస్తే వాటిని తినకుండా ఉండరు. ఈ కీరదోషలో ఎక్కువగా విటమిన్ కె, సీ , పొటాషియం కాపర్ వంటిది ఉంటాయి. సాధారణ రోజులలో కంటే వేసవికాలంలో కీరదోషని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎండని తట్టుకొని 90% పైగా మన శరీరంలో నీటిని ఉంచేలా సహాయపడతాయి. దీనివల్ల శరీరం డిహైడ్రేట్ కూడా అవ్వదు. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా కీరదోష చాలా సహాయపడుతుంది. కానీ కీరదోషను ఎక్కువగా తిన్నా కూడా చాలా నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.


దోసకాయలలో పొటాషియం చాలా ఎక్కువగానే లభిస్తుంది. ఇది రక్తపోటు నియంత్రణించడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల హైపర్ కలేమియా వంటి అనారోగ్య సమస్యలు చుట్టూ ముడుతాయట. ఇది ఎక్కువగా కిడ్నీల పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని తెలుపుతున్నారు. అలాగే కాళ్లు తిమ్మిర్లు పట్టడం గ్యాస్ వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి.

దోసకాయ ఆహారం తినకుండా తింటే మలబద్ధక బారిన పడతారట. ఎందుకంటే ఇది సులభంగా జీర్ణం అవ్వదని తెలుపుతున్నారు.

నీరు అధికంగా ఉండే దోసకాయ శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తోంది. దోసకాయలో ఉండే గింజలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనిని అధికంగా తినడం వల్ల డిహైడ్రేషన్ బారిన కూడా పడతారట.


దోసకాయ ఎక్కువగా చల్లదనాన్ని కలిగి ఉంటుంది. దీని వల్ల జలుబు గొంతు నొప్పి దగ్గు వంటివి కనిపిస్తాయి.


దోసకాయని ఎక్కువగా తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా సమస్యలు ఎదురవుతాయట. ఇందులో ఉండే నీరు తరచూ మూత్రవిసర్జన సమస్యకు దారితీస్తాయి. అంతేకాకుండా అజీర్ణాన్ని కూడా పెంచడంతోపాటు తల్లి బిడ్డ ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని కూడా చూపుతుంది. అందుకే దోసకాయను ఒక మోస్తారు తినడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: