భారతీయులకు వెలగపండు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా వినాయకుడికి ఇష్టమైన పండు గా వీటిని మనం పెడుతూ ఉంటాము. ఇందులో ఉండే విటమిన్-C పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ బూస్ట్ కూడా పెంచేలా చేస్తుంది. ఇది ఆరోగ్యాన్ని కూడా కాపాడేలా చేస్తాయి. ఇందులో ఉండేటువంటి ఖనిజాలు, పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. అలాగే కాల్షియం కూడా ఎముకలో ఆరోగ్యంగా ఉండేలా సహాయపడతాయి. అందుకే వెలగపండుని కనీసం నెలలో ఒకసారైనా తినాలని నిపుణులు తెలియజేస్తూ ఉంటారు.


వెలగ పండులో ఉండే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం జీర్ణ వ్యవస్థను మంచిగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. పెద్దపేగు ఆరోగ్యంగా ఉండేలా వెలగపండు సహాయపడుతుంది.

వెలగపండు తినడం వల్ల మలబద్ధ సమస్య కూడా తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండటంవల్ల ట్యానీన్స్ మలబద్దక పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందట.


వెలగపండుని డైట్ లో చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.. ఫైబర్ కంటెంట్ మాత్రమే కాస్త ఎక్కువగా ఉంటుంది.


వెలగపండులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్ సమస్యల నుంచి కూడా కాపాడుతాయి. అలాగే ముఖం పైన ఉండేటువంటి వృద్ధాప్య ఛాయలు కూడా రానివ్వకుండా చేస్తుంది.

వెలగ పండులో ఇమ్యూనిటీ పెంచేటువంటి గుణాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. రక్తంలో ఉండేటువంటి  ఉండేటువంటి తెల్ల రక్త కణాలను పెంచడానికి ఈ వెలగపండు చాలా ఉపయోగపడుతుంది. ఈ తెల్ల రక్త కణాలు మన శరీరం ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతూ ఉంటాయి.


వెలగపండులో పొటాషియం ఉండడం వల్ల ఇది గుండె ఆరోగ్యాంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే అధిక బీపీ తో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే నెలలో ఒకసారైనా సరే ఈ వెలగ పండుని తినడం మంచిది. ఈ పండుని ఎలాగైనా సరే మనం తినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: