సాధారణంగా ఎండలో వేయడానికి శరీరం డిహైడ్రేషన్ ఎక్కువగా గురువ్వుతూ ఉంటదని ప్రతి ఒక్కరికి తెలుసు.కానీ శరీర జీవక్రియ రేటు మరియు డైజెషన్,శ్వాస కోశ సంబంధిత వ్యాధులు వస్తాయని చాలా మందికి అవగాహన ఉండదు.తీరా అటువంటి సమస్యలు చుట్టూ ముట్టినప్పుడు తెగ బాధపడుతూ ఉంటారు.అటువంటి వారి కోసం వాము చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.మరియు ఆహారం ఇబ్బందులు ఇవే కాక ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని కూడా సూచిస్తూ ఉన్నారు.ఇంకెందుకు ఆలస్యం ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

డీటాక్షఫికేషన్..

వేసవిలో ఎక్కువగా శరీరంలో మలినాలు పేరుకు పోయే అవకాశం ఎక్కువగా అధికంగా ఉంటుంది.అలాంటి మలినాలు శరీరం నుంచి ఫ్లష్ అవుట్ చేయాలి అంటే వాము టీ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇందులో డియరేటిక్ క్వాలిటీస్ అధికంగా ఉండటంతో శరీరంలో వున్న టాక్షిన్ లు ఈజీగా తొలగిపోయి,మూత్రం రూపంలో బయటికి వచ్చేస్తాయి.దీనితో శరీరారోగ్యం మరింత మెరుగు పడుతుంది..

రోగ నిరోధక శక్తి పెరగడానికి..

చాలామంది వేసవిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉన్న ఫ్రూట్స్ మరియు పానీయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.వీటి వల్ల కొంతమందికి కోల్డ్, కాప్ చుట్టుముట్టి అవకాశం ఎక్కువగా ఉంటుంది.అలాంటివారు వామాకుతో తయారు చేసిన టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి,వాటన్నిటిని దూరం చేస్తాయి.

అజీర్తి తొలగించడానికి..

వేసవికాలం గ్యాస్ట్రిక్ యాసిడ్ అధికంగా ఫామ్ అయ్యి, గ్యాస్,మలబద్దకం వంటి అజీర్తి సమస్యలు అధికమవుతాయి.ఈ సమస్యలతో బాధపడేవారు ఏ కాలంలోనైనా వాముతో తయారు చేసిన టీ కానీ, కషాయం కానీ తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ మొత్తం తగ్గిపోయి,అజీర్తి సమస్యలు దూరం అవుతాయి.

బరువు తగ్గడానికి..

వామాకులో ఉన్న అధిక డైయేటరీ ఫైబర్స్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను వెన్న కరిగించినట్టు కరిగించేస్తాయి.దీనితో శరీరం సన్నబడడానికి రెడీ అవుతుంది.మరియు వాము జీవక్రియ రేటును పెంచడంలో ముందుంటుంది అని చెప్పవచ్చు.కావున ప్రతి ఒక్కరు రోజుకు ఒక కప్పు వాము టీ తీసుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం..

మరింత సమాచారం తెలుసుకోండి: