ఈ మధ్యకాలంలో పిల్లలు జంక్ ఫుడ్,బేకరీ ఫుడ్,డైరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వారిలో ఆకలి శక్తి తగ్గిపోయి వారు క్రమంగా ఇతర ఆహారాలను తీసుకోవడానికి అనాశక్తి చూపిస్తూ ఉన్నారు.ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వారు చిన్న వయసులోనే అధిక బరువు, డయాబెటిస్, బిపి, కొలెస్ట్రాల్, రోగనిరోధకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే వయసుకు మించిన బరువు పెరగడంలో ఈ జనరేషన్ పిల్లలు ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు.అలా కాకుండా జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ కొన్ని రకాల ఆహారాలను మెల్లమెల్లగా వారికి అందించడం వల్ల వారికి సరైన పోషకాలు అందటమే కాకుండా,మరి ఆకలి కూడా తొందరగా తగ్గిపోతుందట.మరియు పిల్లలు కూడా వాటిని ఇష్టంగా తింటారు అని చెబుతున్నారు ఆహారం నిపుణులు.మరి అవేంటో మనము తెలుసుకుందాం పదండి..

అరటిపండు..
అరటిపండు పోషకాల గని అని చెప్పవచ్చు ఇది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టంగా మరియు ఈజీగా తినే పండు.తినడానికి మారం చేస్తూ బక్క పల్చగా ఉన్న పిల్లలకు రోజుకొక అరటి పండు  తినిపించడం చాలా ఉత్తమం.ఇందులో ఫైబర్, పొటాషియం,విటమిన్ -C,విటమిన్-B6 పుష్కలంగా లభిస్తాయి.అరటిపండు బరువును కూడా పెంచుతుంది.

పాలు,పెరుగు..
ఈ పదార్తలలో సహజమైన ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్ లకు మంచి మూలం.వీటిని రోజు పిల్లలకు ఇవ్వడంతో,వారు ఈజీగా బరువును పెరుగుతారు.కానీ ఎవరికైనా లాక్టోస్ అలెర్జీ ఉంటే వారికి డాక్టర్ సలహాతో సోయా మిల్క్ ఇవ్వడం చాలా మంచిది.


బంగాళా దుంపలు..
బంగాళాదుంపలు కార్బోహైడ్రేట్లకు గని లాంటిది. బక్క పల్చగా వున్న పిల్లల బరువు పెరగాలంటే రోజువారీ ఆహారంలో కనీసం 40% కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి. బంగాళదుంపలలో ఉండే అమినో యాసిడ్‌లు పిల్లల బరువు పెరగడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి.

చికెన్..
ప్రోటీన్ బెస్ట్ ప్రోటీన్ ఫుడ్.ఇది కండరాలను బలపరుస్తుంది.మరియు చిన్నారుల బరువును పెంచుతుంది.రోజువారీ ఆహారంలో చికెన్‌ని తీసుకోకూడదు.వారానికి 2-4 రోజుల్లో చికెన్ ఆహారంతో పాటు తీసుకుంటే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: