గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది.నరాలు,కండరాల పనితీరులో మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.మరియు న్యూరోట్రాన్స్మిటర్ కార్యకలాపాలను,కండరాల సంకోచాలను నియంత్రించడంలో వేగవంతంగా పనిచేస్తుంది.వీటిని తరుచూ తీసుకోవడంతో బలమైన నాడీ వ్యవస్థ ఏర్పడటంతోపాటు,కండరాల తిమ్మిరి, నొప్పులకు తొందరగా ఉపశమనం కలిగిస్తుంది.
అంతేకాక పురుషులలో సంతానోత్పత్తి సమస్యలను తొలగిస్తుంది.ఎందుకంటే ఇందులో జింక్‌లో పుష్కలంగా లభిస్తుంది.ఇవి శీఘ్రస్ఖలనం సమస్యలు,లైంగిక ప్రేరణతో సహా సంతానోత్పత్తి సమస్యలను పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
మరియు ఈ గింజలలో ప్రోటీన్,ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.ఇవి బరువు నిర్వహణను క్రమబద్ధీకరించి,అధిక బరువును తొందరగా తగ్గేలా చేస్తాయి.వీటిని భోజనం తర్వాత తింటే,పొట్ట నిండుగా మారి,అతిగా తినాలని కోరిక అదుపులో ఉంటుంది
గుమ్మడి గింజలలో అధికంగా ఉన్న మెగ్నీషియం మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్,అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ జింక్ గుండె పనితీరును మెరుగు పరచడమే కాకుండా దృఢంగా,బలంగా తయారవడానికి కూడా దోహదపడతాయి.
గర్భిణీ కడుపుతో ఉన్న మహిళలు రోజుకు ఒక స్పూన్ మోతాదులో గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల,ఇందులో ఉన్న జింక్ పుట్టబోయే శిశువులో ఐక్యూ లెవెల్స్ ను పెంచడానికి దోహదపడుతుంది.
కావున మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే,వెంటనే గుమ్మడి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో సహా తీసుకోవడం అలవాటు చేసుకోవడంతో చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.