ఇక కొంత మంది అయితే ఏకంగా పడుకునేటప్పుడు కూడా మొబైల్ పక్కలోనే ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఇక చార్జింగ్ పెట్టి ఇక పక్కనే మొబైల్ పెట్టుకుని పడుకోవడం నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక అలవాటుగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఎంతో ప్రమాదం పొంచి ఉంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ అటు జనాలు తీరులో మాత్రం అస్సలు మార్పు రావడం లేదు అని చెప్పాలి.
అయితే మొబైల్ ఫోన్ పక్కనే పెట్టి నిద్రపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్.. క్యాన్సర్ కు దారి తీస్తుందంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలకు మెదడు వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందట. పక్కన పెట్టుకున్నప్పుడు పేలితే ఇక పెద్ద ప్రమాదం సంభవించవచ్చు అంటూ హెచ్చరిస్తున్నారు ఫోన్ ద్వారా వచ్చే నీలి కాంతితో నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయట. అందుకే వీలైనంతగా ఫోను దూరంగా ఉంచాలి అంటూ సూచిస్తున్నారు అలారం కోసం అయితే ప్రత్యేకమైన వాచ్ కొనుగోలు చేస్తే మేలు అంటూ సూచిస్తున్నారు నిపుణులు.