![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/health/movies_news/pain-leavesb0980ab8-2d91-49ed-8c98-4aa48f87ffc2-415x250.jpg)
యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీల పైన తీవ్రమైన ప్రమాదం చూపిస్తుంది.. దీనివల్ల కిడ్నీలు సరిగా ఫిల్టర్ చేయలేకపోతాయట. అంతేకాకుండా పొత్తి కడుపులో నొప్పి, మోకాళ్ల నొప్పులు, జ్వరం, మూత్ర విసర్జనలు ఇబ్బందులు ఇవే యూరిక్ యాసిడ్ యొక్క లక్షణాలు వీటిని తగ్గించుకోవాలి అంటే.. తులసి చెట్టు ఆకులలో చాలా ఔషధ గుణాలు లభిస్తాయి.. తులసి ఆకులను తరచూ నమిలి తింటూ ఉండడం వల్ల రీజనల్ వ్యాధులను కూడా దరిచేరకుండా చేస్తుంది. అలాగే యూరిక్ యాసిడ్ కూడా చెక్ పెట్టవచ్చు.
కొత్తిమీర ఇది మనకు ఎక్కడైనా సరే అందుబాటులో లభిస్తుంది. కొత్తిమీరలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని తగ్గించుకోవచ్చు. కొత్తిమీరలో ఉండే ఔషధ గుణాలు కూడా యూరిక్ యాసిడ్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే కొత్తిమీర తినడం వల్ల రక్త శుద్ధి అవుతుంది విష పదార్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. కొత్తిమీర రసం లేదా నమిలి తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
వేప ఆకులలో లేదా వేపకాయలలో మెడిసిన్ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అందుకే పూర్వపు రోజుల్లో వీటిని ఎన్నో రకాలుగా ప్రజలు ఉపయోగించేవారు. ఎవరికైనా యూరిక్ యాసిడ్ లక్షణాలు కనిపిస్తే వేప ఆకుల ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా శరీరంలో ఉండే విషయాన్నీ కూడా బయటికి పంపించాలా చేస్తుంది.