ఎక్కువమంది ప్రతి వంటకాలలో రుచిగా ఉండడానికి ఉప్పు వేసుకుంటూ ఉంటారు. ఉప్పు ఆరోగ్యానికి అవసరమో అంతే పెనుముప్పుగా మారుతోందని Who ఆందోళన తెలియజేస్తోంది. వాస్తవానికి తరచుగా డబ్ల్యుహెచ్వో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ఏ వ్యాధి తీవ్రత అయితుంది అనే విషయాన్ని ఆరోగ్య సంస్థ తరచు అందిస్తూ ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం.


తాజాగా ఆరోగ్య సంస్థ ఉప్పు గురించి తెలియజేసిన సమాచారం ప్రకారం ఉప్పు ఎక్కువగా తినే వారికి గుండె జబ్బులకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయని హెచ్చరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరోపాలో ప్రతిరోజు కనీసం 10,000 మంది ఇలాంటి గుండె జబ్బులతో మరణిస్తున్నారని తెలియజేశారు. దీంతో ప్రతి ఏటా కూడా 40 లక్షలకు మందికిపైగా గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారట. ఇదంతా కూడా ఉప్పు ఎక్కువగా తినడం వల్ల సంభవిస్తున్నాయట.. ఉప్పుని తినడం తగ్గిస్తే ఈ సంఖ్యను కూడా మనం తగ్గించుకోవచ్చు.


ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తినే వారు అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఐదు గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య సంస్థ తెలియజేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక రక్తపోటు కలిగిన రోగులు యూరప్ లో మాత్రమే కలిగి ఉన్నారని WHO తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ గుండె జబ్బుల వల్ల మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలియజేశారు. ముఖ్యంగా ఉప్పుని ఎంత తగ్గించి తింటే అంత మంచిదంటూ ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.


 టేస్టింగ్ సాల్ట్ అనేది కూడా చాలా ప్రమాదకరమని వీటిని చైనీస్ ఫుడ్ మరియు వివిధ రకాల మసాలతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఈ టెస్టింగ్ సాల్ట్ తో చేసేటువంటి ఆహార పదార్థాలు తిన్నవారు ఇతర పదార్థాలతో చేసినవి పెద్దగా నచ్చవు. వీటిని తినేవారికి హై బీపీ, డయాబెటిస్, కండరాళ్లు ముడుచుకోవడం వీటితోపాటు కాళ్లు చేతులు వంటివి రాయడం సూదులు గుచ్చినట్లుగా అనిపించడం వంటివి ఎదురవుతాయట. మొత్తానికి ఉప్పు ఎక్కువగా తింటే చాలా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: