ఒకప్పుడు ఎవరూ కూడా గడ్డం పెంచుకోవడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. గడ్డం పెంచుకున్న వాళ్ళని ఏకంగా పిచ్చి వాళ్ల లాగానే చూసేవారు. అయితే అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎంతో నీట్ గా క్లీన్ షేవ్తో కనిపించేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం గడ్డం పెంచుకోవడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చిన స్టైల్ లో గడ్డాన్ని డ్రీమ్ చేసుకుని అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నేటి జనరేషన్లో ఎవరిని చూసినా కూడా గడ్డం పెంచుకుని కనిపిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 అయితే కొంతమంది యువకులు మాత్రం ఏకంగా గడ్డం పెంచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే చిన్న వయసులోనే గడ్డం నెరిసిపోయి తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి అని చెప్పాలి. దీంతో గడ్డంని మెయింటైన్ చేయలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు యువకులు. అయితే ఇలా చిన్న వయసులోనే గడ్డం తెల్లబడకుండా  ఉండడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయని నిపుణులు  చెబుతున్నారు. అవేంటో చూద్దాం..


 ఒత్తిడి, ఆందోళనకు దూరం కావడం  : నేటి బిజీ లైఫ్ లో ఇది చెప్పినంత ఈజీ కాదు. కానీ ట్రై చేయడంలో తప్పులేదు. ఒత్తిడికి ఆందోళన కారణంగానే ఏకంగా గడ్డం తెల్లగా మారడానికి కారణం అవుతుండదట. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ధ్యానం యోగ వంటివి ట్రై చేయడం ఎంతో బెటరట.

 కొబ్బరి నూనె, నిమ్మ ఆకు మిశ్రమం  : కొబ్బరి నూనె నిమ్మకాయ ఆకుల మిశ్రమాన్ని ఇలా గడ్డం తెల్లగా మారిన చోట అప్లై చేయాలట. నిమ్మ ఆకులలో విటమిన్ లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. కాబట్టి ఇక జుట్టు రంగును మార్చడంలో సహాయపడతాయట.


 ఉసిరి పొడి : జుట్టును నల్లగా మార్చడానికి ఎంతగానో ప్రసిద్ధి చెందిన సహజం నివారణ ఉసిరి పొడి. మీరు ఉసిరికాయ పొడిని నీటితో కలిపి పేస్టులా మార్చి గడ్డానికి అప్లై చేసి 30నిమిషాల తర్వాత కడుక్కుంటే  ఉపయోగముంటుందట

 విటమిన్ బి12  : సరైన ఆహారం తీసుకోవడం ద్వారా గడ్డం వెంట్రుకలు తెల్లబడే సమస్య నుంచి బయటపడవచ్చు అని నిపుణులు అంటున్నారు. విటమిన్ బి 12, ఐరన్,  జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం బెటర్ అని చెబుతున్నారు. అయితే ఇది గడ్డం రంగు నల్లగా ఉండేందుకు సహాయం పడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: