ఓట్స్ ఎక్కువ తింటున్నారా? అయితే తిప్పలు తప్పవు?
ఓట్స్ ఎంత ఆరోగ్యకరమైన ఆహారమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఓట్స్ ఎక్కువగా తినడం వల్ల ఖచ్చితంగా కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్ అందరికీ మంచిది కాదంటున్నారు.ఎందుకంటే వాటి వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఓట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. కానీ ఇది కొందరిలో గ్యాస్, ఉబ్బరానికి కూడా దారిస్తుందని చెబుతున్నారు.ఇంకా అలాగే, కొంతమందిలో కడుపు నొప్పి, మలబద్ధకానికి కూడా కారణం అవుతుంది. ఓట్స్ అతిగా తింటే కలిగే అనర్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఓట్స్.. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తినే చాలా పోషకమైన ఆహారం. ఇది ప్రధానంగా కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం. కానీ, కొంతమందిలో ఓట్స్ తినడం వల్ల దురద, వాపు ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ ప్రతిచర్యలు కలిగే అవకాశం ఉంది.
సాధారణంగా, రోజుకు ఒక కప్పు ఓట్స్ తినడం మాత్రం సురక్షితం.ఈ ఓట్స్‌ను ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో కలిపి తినండి. ఫైబర్, ఇతర పోషకాలను కూడా అందిస్తుంది. ఓట్స్‌ను తయారు చేసేటప్పుడు కొవ్వు లేదా చక్కెరను అస్సలు వేసుకోవద్దు. ఎందుకంటే ఇలా చేస్తే కేలరీల కంటెంట్‌ను పెంచుతుంది.ఓట్స్ కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ ఓట్స్ సాధారణంగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి. కొన్నిసార్లు కర్మాగారాల్లో ఓట్స్ ప్రాసెస్ చేయబడినప్పుడు, వాటిని ఇతర గ్లూటెన్-కలిగిన ధాన్యాలతో కలుపుతారు.అందువల్ల వాటిలోని గ్లూటెన్‌ను జీర్ణించుకోలేని వ్యక్తులకు సమస్యలను కలిగిస్తుంది.ఇంకా అలాగే ఓట్స్ కొందరికి జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. ఓట్స్ అనేవి సాధారణంగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి. కొన్నిసార్లు కర్మాగారాల్లో ఓట్స్ ప్రాసెస్ చేయబడినప్పుడు, వాటిని ఇతర గ్లూటెన్-కలిగిన ధాన్యాలతో కలుపుతారట. వాటిలోని గ్లూటెన్‌ను జీర్ణించుకోలేని వ్యక్తులకు ఖచ్చితంగా సమస్యలను కలిగిస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: