నేటి రోజుల్లో టెక్నాలజీకి అనుగుణంగా మనషి తన జీవనశైలిలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో ఇక స్వార్థపూరిత ఆలోచనతోనే ముందుకు సాగుతున్నాడు. తాను సౌకర్యవంతంగా ఉండడానికి ఏం చేయడానికైనా రెడీ అవుతున్నాడు. భవిష్యత్తు ప్రమాదాలను అంచనా వేయలేక పోతున్నాడు. ఇలాంటి వాటిలో భాగంగానే  అడవులను తొలగిస్తూ ఉండడం కూడా చేస్తూ ఉన్నాడు. ఏకంగా ఎక్కడికక్కడ చెట్లను నరికేస్తూ అడవులను తొలిచేస్తూ పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకుంటూ ఉండడం నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం.



  దీంతో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం మనిషి మనుగడకే ప్రమాదకరంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో మనుషులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా అందే పరిస్థితి కనిపించడం జరుగుతుంది. అయితే మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో అయితే ఇక వాయు కాలుష్యం కారణంగా ప్రజలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా వాయు కాలుష్యం కారణంగా ఎప్పుడు వాతావరణ పరిస్థితులు పొగ మంచు కప్పుకుపోయినట్లుగా  కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా వాయు కాలుష్యం కారణంగా ప్రతిరోజు కూడా వందల మంది ఇండియాలో చనిపోతున్నారట.


 ఇటీవల తెరమీదికి వచ్చిన ఒక నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా 2021 సంవత్సరంలోనే మన దేశంలో రోజుకి సగటున 464 మంది ఐదేళ్లలోపు చిన్నారులు చనిపోయారట. అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2024 లో ఈ విషయం వెళ్లడైంది. అయితే ఇలా వాయు కాలుష్యం కారణంగా.. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు అయిన ఆస్తమా న్యుమోనియాతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నట్లు ఇక నిపుణులు గుర్తించారట. దీనిని నియంత్రించకపోతే రానున్న రోజుల్లో మనిషి మనుగడ మరింత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: