మనకు డైలీ  అనేక రకాల టీలు తాగుతూ ఉంటాము. అయితే వాటిల్లో చాలా వరకు అన్ని టీలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనే అందిస్తాయి. అయితే అలాంటి టీలలో లెమన్ గ్రాస్ టీ కూడా ఒకటి.అయితే దీన్నే నిమ్మ గడ్డి అని కూడా అంటారు. నిజానికి నిమ్మకాయలకు, నిమ్మచెట్లకు, నిమ్మ గడ్డికి సంబంధం లేదు. కానీ నిమ్మగడ్డి అచ్చం నిమ్మకాయలను పోలిన వాసన అనేది వస్తుంది. పైగా గడ్డి మాదిరిగా ఉంటుంది. అందుకే దానికి నిమ్మగడ్డి అని పేరు వచ్చింది. దీన్నే లెమన్ గ్రాస్‌గా పిలుస్తారు.అయితే ఈ టీని తాగడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక ఈ టీని ఎలా తయారు చేయాలి.. దీంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.. పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టవ్‌ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి. తరువాత అందులో నిమ్మగడ్డి వేసి మరో 10 నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూతపెట్టేయాలి. 


ఇక కప్పులో తేనె వేసుకొని, ముందుగా మరిగించుకున్న నీటిని అందులోకి వడకట్టుకోవాలి. అప్పుడు పసందైన నిమ్మగడ్డి టీ రెడీ అవుతుంది. ఇక దీన్ని అలాగే గోరు వెచ్చగా ఉండగానే తాగవచ్చు. తేనె వద్దనుకునేవారు ఇందులో బెల్లం కలుపుకుని తాగవచ్చు. ఈ టీని తాగడం వల్ల మనకు చాలా లాభాలు కలుగుతాయి. ఈ లెమన్ గ్రాస్ టీలో సిట్రల్ జెరేనియల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇక ఇది గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. హార్ట్ ఎటాక్ రాకుండా మనల్ని రక్షిస్తుంది. అలాగే ఈ లెమన్ గ్రాస్ టీ యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది.పైగా దీన్ని తాగడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల ఆగిపోతుంది. దీంతో మనం క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.ఇంకా అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా అలాగే లెమన్ గ్రాస్ టీ తాగితే పొట్టలో అల్సర్లు తగ్గిపోతాయి. బీపీ తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. జీవక్రియలు నియంత్రించబడతాయి. దీంతో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు ఈజీగా బయటకు వెళ్లిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: