మనలో చాలా మంది కూడా ఉదయం లేవగానే తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. అయితే ఇందుకు బదులుగా మీరు ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ను తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి డ్రింక్స్‌ను ఉదయాన్నే తాగడం వల్ల మీరు ఎన్నో తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షింపబడతారు. అయితే అలాంటి ఆరోగ్యకమైన డ్రింక్స్‌లో తులసి, అల్లం నీళ్లు కూడా ఒకటి. ఉదయాన్నే నీటిలో తులసి ఆకులు, అల్లం వేసి వాటిని బాగా మరిగించి ఆ నీళ్లను తాగుతుంటే ఖచ్చితంగా ప్రయోజనాలు కలుగుతాయి.అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ప్రతి రోజూ ఉదయాన్నే తులసి అల్లం నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగు పడుతుంది. అయితే పరగడుపునే ఈ నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో అధిక బరువు చాలా సులభంగా తగ్గుతారు. ఇంకా అలాగే ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. తులసి ఇంకా అల్లం నీళ్లలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అలాగే ఈ నీళ్లలో యాంటీ వైరల్‌, యాంటీ కొలెస్ట్రాల్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 


అందువల్ల ఈ నీళ్లను తాగితే రోగనిరోధక వ్యవస్థ ఈజీగా బలపడడమే కాకుండా గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ నీళ్లను ఉదయం పూట పరగడుపునే తాగితే బరువును తగ్గించుకోవడం చాలా తేలికవుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు కూడా ఈజీగా కరిగిపోతుంది.ఈ తులసి ఆకుల్లో యూజినాల్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియను బాగా మెరుగు పరుస్తుంది.అలాగే అల్లంలో ఉండే జింజరాల్ అనే సమ్మేళనం జీర్ణక్రియను మెరుగు పరిచి కొవ్వును కరిగిస్తుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటే మీకు తులసి, అల్లం నీళ్లు బెస్ట్ ఆప్షన్. ఈ నీళ్లను ప్రతి రోజూ తాగుతుంటే సీజనల్ వ్యాధుల నుంచి చాలా ఈజీగా బయట పడవచ్చు. పైగా ఈ నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇమ్యూనిటీ ఈజీగా పెరుగుతుంది. ఇంకా అలాగే బాడీ డిటాక్స్ అవుతుంది. శరీరంలోని వ్యర్థాలన్నీ కూడా ఈజీగా బయటకుపోయి శరీరం లోపల శుభ్రంగా మారుతుంది. ఇంకా అలాగే ఉదయం ఈ నీళ్లను తాగడం వల్ల నోరు బాగా శుభ్రపడుతుంది. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇలా తులసి, అల్లం నీళ్లతో చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఖాళీ కడుపుతో తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి: