శరీరంలో చెత్తని క్లీన్ చేసే సూపర్ డ్రింక్స్ ఇవే? 

శరీరంలో చెత్త పేరుకుపోవడం వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు నిత్యం వస్తుంటాయి.అయితే ఈ చెత్తని శరీరం నుంచి తొలగిస్తే శరీరం వ్యాధుల బారిన పడడం కూడా తగ్గుతుంది. మరి ఈ చెత్తని తొలగించుకోవడానికి కొన్ని రకాల డ్రింక్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. సహజంగా లభించే ఈ డ్రింక్స్‌ ద్వారా పొట్ట శుభ్రంకావడంతో పాటు, శరీరంలోని క్రిములు కూడా చనిపోతాయి. ఇక ఆ డ్రింక్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.వాము నీటిని తాగడం వల్ల కూడా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. రాత్రంతా నానబెట్టిన వాము నీటిని ఉదయం లేవగానే ఈ నీటిని తాగితే శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. ఇంకా అలాగే జామకాయ ఆకులతో చేసిన కషాయం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్‌ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది లివర్‌లో దెబ్బతిన్న కణాలను రిపేర్‌ చేస్తుంది.


ఇంకా అలాగే కొబ్బరి నీటిని తాగడం వల్ల కూడా శరీరంలో విష పదార్థాలు ఈజీగా తొలగిపోతాయి. ఎందుకు కొబ్బరి నీరు పేగు కదలికను పెంచుతుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యలను ఈజీగా దూరం చేస్తుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగితే కడుపు సంబంధిత సమస్యలు నయమవుతాయి.అలాగే నిమ్మకాయ, అల్లం రసాన్ని కలుపుకొని తీసుకోవడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా తొలగిపోతాయి. ఎందుకంటే అల్లంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఉదయం పూట లేవగానే ఈ డ్రింక్‌ తాగితే ఎంతో మేలు జరుగుతుంది.ఇంకా గ్రీన్‌ టీని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరం శుభ్రంగా మారుతుంది.ఎందుకంటే గ్రీన్‌ టీలో శరీరాన్ని శుభ్రపరిచే యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడడంలో గ్రీన్‌ టీ ఉపయోగపడుతుంది. మన శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: