కొన్ని సంవత్సరాల క్రితం గుండె సంబంధిత వ్యాధులు జనాలలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉండేవి. అందుకు ప్రధాన కారణం కొన్ని సంవత్సరాల క్రితం జనాలు ఎక్కువగా కష్టపడుతూ ఉండేవారు. అలాగే ఎక్కువ మందు వంటకాలు , ఆయిల్ వంటకాలు తినేవారు కాదు. వాటి వల్ల వారికి గుంట సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చేవి కావు. కానీ నేటి తరంలో చిన్న వయసు నుండే పిల్లలు ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తింటున్నారు. అలాగే అనేక రకాలైన జంక్ ఫుడ్ ను కూడా తింటున్నారు. అలాగే మనం తినే ప్రతి కూరగాయలను కూడా మందుల ద్వారానే పెంచుతున్నారు.

ఇలా అనేక కారణాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారికి కూడా వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ వంటకాల ద్వారా గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి. వేటిని దూరం చేయడం ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులు తగ్గించుకోవచ్చు అనే విషయాలను తెలుసుకుందాం. ప్రాసెస్ చేయబడిన మాంసం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి. వీటిలో బకన్ , హమ్ లో శాజురేటేడ్ ఫ్యాట్ , సోడియం ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

శుద్ధి చేసిన రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పాస్తా , పిజ్జాలు తిన్నా కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. చక్కర కూడా శరీరానికి ఎంతో హాని చేస్తుంది. కూల్ డ్రింక్స్ , కృత్రిమ పానీయాలు గుండెపోటుకు కారణం అవుతాయి. ఇలా మనం నిత్యం తీసుకునే ఎన్నో పదార్థాల ద్వారా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు చాలా దూరంగా ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: