విటమిన్ డి లోపం ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. శరీరానికి ఎంతో అవసరమైన ఈ విటమిన్ లోపిస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ముఖ్యమైన విటమిన్ మన రోగనిరోధక శక్తి, ఎముకల బలాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి తగినంత విటమిన్ డి అందకపోతే, ఆస్టియోపొరోసిస్, రికెట్స్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఇది జలుబు, ఫ్లూ వ్యాధులకు వ్యతిరేకంగా రక్షణ కల్పించడంలో కూడా సహాయపడుతుంది. కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది.

మనకు విటమిన్ డి అనే ముఖ్యమైన పోషకం ఎక్కువగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. కానీ చేపలు (ట్యూనా, సాల్మన్), గుడ్డు సొనలు, పుట్టగొడుగులు వంటి కొన్ని ఆహారాల్లో కూడా ఇది ఉంటుంది. సూర్యరశ్మిలో తగినంత సమయం గడపకపోవడం లేదా విటమిన్ డి తక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల ఈ లోపం రావచ్చు. దీనివల్ల అలసట, ఎముక నొప్పులు, రోగనిరోధక శక్తి బలహీనపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఢిల్లీలోని GTB ఆసుపత్రికి చెందిన డాక్టర్ అంకిత్ కుమార్ తాజాగా మాట్లాడుతూ విటమిన్ డి లోపం మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, మానసిక స్థితిలో మార్పులు, నిస్సత్తువ, ఆందోళన లేదా డిప్రెషన్‌కు కూడా దారితీస్తుందని తెలిపారు. ఎందుకంటే ఇది మెదడులోని రసాయన సందేశకాల (న్యూరోట్రాన్స్‌మిటర్లు) పనితీరును ప్రభావితం చేస్తుంది.

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే  రోజుకు 15-20 నిమిషాలు సూర్యరశ్మిలో గడపాలి. చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తినాలి. పాల ఉత్పత్తులు కూడా మంచి వనరులు. లోపం ఉందని పరీక్షల్లో తేలితే వైద్యుడి సలహా మేరకు సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది.

విటమిన్ డి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కండరాల బలాన్ని మరియు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు డిప్రెషన్, ఆందోళన లక్షణాలను తగ్గిస్తుంది.

విటమిన్ డి లోపం లక్షణాలు తెలుసుకుంటే  అలసట, ఎముక నొప్పులు, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, మోడ్ స్వింగ్స్, నిరాశ, రోగనిరోధక శక్తి బలహీనపడటం. పిల్లలు, పెద్దలకు విటమిన్ డి లోపం వచ్చే అవకాశం ఉంది. చర్మం ముదురు రంగులో ఉన్న వ్యక్తులు, ఎక్కువ సేపు ఇంట్లోనే ఉండే వ్యక్తులు, సూర్యరశ్మికి గురికాకుండా ఉండే వ్యక్తులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులకు కూడా ఈ లోపం వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: