అయితే జ్వరం వస్తే ఎలాంటి టాబ్లెట్ వేసుకోవాలి ఒకవేళ జలుబు వస్తే ఎలాంటి సిరప్ తాగాలి అన్న విషయం అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. కానీ జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి అనే విషయంపై మాత్రం కొంతమంది కొన్ని విషయాలపై ఇప్పటికి అనుమానాలు పడుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు అనే విషయంపై ప్రతి ఒక్కరిలో కొన్ని అనుమానాలు ఉంటాయి అని చెప్పాలి అయితే చాలామంది జ్వరం వచ్చినప్పుడు నాన్వెజ్ తినాలా వద్దా అనే విషయంపై చాలా సందేహాలను పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే ఇక ఫీవర్ మరింత ఎక్కువ అవుతుందని అనుకుంటూ ఉంటారు.
ఇలా జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ తినాలా వద్దా అని చాలామంది సందేహ పడుతూ ఉంటారు. అయితే ఆయిల్ మసాలాలు తక్కువ వేసి వండిన చికెన్ తినొచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. గ్రిల్డ్ చికెన్, బిర్యాని, ఫ్రై చికెన్ తింటే కడుపు మంటగా ఉంటుందని చెబుతున్నారు. ఇక త్వరగా జీర్ణం కూడా కాదు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే వాటి జోలికి అస్సలు వెళ్లొద్ధు అంటూ హెచ్చరిస్తున్నారు. చికెన్ లో ప్రోటీన్లు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయని.. అందుకే చికెన్ కేవలం వండుకొని తినడం మాత్రమే కాదు సూప్ గా తాగినా కూడా ఎంతో మంచిది అంటూ వైద్యులు సూచిస్తూ ఉండడం గమనర్హం.