లవంగాలు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటి వల్ల శరీరంలో పేరుకుపోయిన అవాంఛిత కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత లవంగాలను నోటిలో వేసుకుని నమలడం వల్ల నోటి దుర్వాసనను తొలగించడమే కాకుండా నోట్లో తయారయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. జలుబు, దగ్గుకు లవంగం మంచి మందు. నోట్లో ఓ రెండు లవంగాలు వేసుకొని చప్పరిస్తుంటే ఉపశమనం లభిస్తుంది. లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది. లవంగంలో మాంగనీసు పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, ఎముకలు దృఢంగా మారేందుకు లవంగాలు సహయపడతాయి.తులసి ఆకులు, పుదీనా ఆకులు, లవంగాలు ఇంకా యాలకుల మిశ్రమంతో కషాయం చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 


అలాగే కొన్ని లవంగాలు తీసుకుని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి ఎన్నో రకాలుగా మంచి చేస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా లవంగం బాగా పనిచేస్తుంది. పొటాషియం, ఐరన్, క్యాల్షియం వంటి ఎన్నో మినరల్స్, విటమిన్స్ లవంగంలో దొరుకుతాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రోజూ రాత్రి భోజనం తర్వాత రెండు లేదా మూడు లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. లవంగాలను తింటే జీవక్రియల రేటు పెరుగుతుంది. సులభంగా బరువు తగ్గుతారు. మనం ప్రతి రోజు తాగే టీ లో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది. క్రమం తప్పకుండా ఆహారం లో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మెడిసిన్ లాగా పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: