బొద్దింకలు.. వీటని చూస్తేనే కొందరికి శరీరంపై తేళ్లు, జెర్లు పాకినట్లు అవుతుంది. ఉదయం పూట ఎక్కుడ దాక్కుంటాయో గానీ, రాత్రి పూట వంట గది, బెడ్ రూమ్, బాత్రూమ్ అన్ని గదులనూ కబ్జా చేసేస్తాయి. మనకు ఒకటి కనిపించిందంటే..దాని గుంపు లోపల దాక్కున్నట్టే లెక్క. వర్షా కాలం రాగానే బొద్దింకల సమస్య ఎక్కువవుతుంది. ఇంటి పెరటిలో, వంట గదిలో కాసింత చెత్త పోగైనా అక్కడ బొద్దింకలు వాలిపోతుంటాయి. అక్కడి నుంచి ఇల్లంతా తిరుగుతూ చికాకు పెడుతుంటాయి.పల్లెలు, పట్టణాలు అనే తేడా లేదు. ఎక్కడైనా ఈ బొద్దింకల సమస్య ఉంటుంది.బొద్దింకలు చాలా కలుషితమైన ప్రాంతాలలో జీవిస్తాయని అటవీ పర్యావరణ పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న కీటక శాస్త్రవేత్త బ్రోనోయ్ చెప్పారు.బొద్దింకలు తరచుగా వాడని, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిష్ట వేస్తుంటాయి. కాబట్టి, కప్బోర్డులను నెలకోసారైనా శుభ్రం చేస్తుండండి.ఇవి సింకుల కింద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. సింకుల కిందా శుభ్రం చేస్తూ ఉండాలి.బొద్దింకల ద్వారా వ్యాధులు వస్తాయనే భయం పురాతన గ్రీస్ కాలం నుంచి బ్రోనోయ్ తెలిపారు.బొద్దింకలు, ఇంట్లో తిరుగుతూ ఖాళీగా ఉండవు.. ఇవి బ్యాక్టీరియాలను వ్యాప్తి చేస్తాయి. వంట పాత్రలలో, కూరగాయలు, పండ్లపై తిరుగుతూ.. ఇ-కోలి, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలను స్ప్రెడ్ చేస్తాయి. బొద్దింకల బెడదను వదిలించుకోకపోతే.. అనారోగ్యాల పాలయ్యే ప్రమాదం ఉంది. ఇంటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకున్నాగానీ.. బొద్దింకలు ఏదో మూల కనిపిస్తూనే ఉంటాయి. 

వీటిని సింపుల్, ఎఫెక్టివ్ టిప్స్తో ఇంటి నుంచి తరిమేయవచ్చు. అవేంటంటే..కెరోసిన్ బొద్దింకలకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది. బొద్దింకలకు.. కెరోసిన్ వాసన పడదు. మీరు బొద్దింకలను ఇంటి నుంచి తరిమికొట్టడానికి.. నీళ్లలో కెరోసిన్ మిక్స్ చేసి.. ఇంటి మూలల్లో, బొద్దికలు ఎక్కువగా తిరుగుతున్న చొట్లు, సింక్ పైప్ వద్ద స్ప్రే చేయండి. ఇలా చేస్తే.. బొద్దింకలు పారిపోతాయి.లవంగాలు.. బొద్దింకలను తరిమికొట్టడానికి సహాయపడతాయి. ఇంటి మూలల్లో, తడిపొడి ప్రాంతాల్లో, అల్మారాలు, ర్యాక్స్, బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో.. లవంగాలను చిన్న పొట్లాల్లో వేసి ఉంచండి. ఇలా చేస్తే ఆ ప్రాంతాలకు బొద్దింకలు రావు. బిర్యానీ ఆకులను పొడిచేసి.. పొయ్యి గట్టు కింద, అల్మరాలు, రోజువారీ శుభ్రం చేయని ప్రదేశాల్లో దాన్ని చల్లండి. ఈ వాసనకు బొద్దింకలు పారిపోతాయి.దాల్చినచెక్కకు ఘాటైన వాసన ఉంటుంది. బొద్దింకలకు.. అలెర్జిక్ రియాక్షన్ ఇస్తుంది. దాల్చిన చెక్క పొడిని.. ఉప్పులో కలిపి.. బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో చల్లండి. ఇది బొద్దింకలు, వాటి గుడ్లను కూడా నాశనం చేస్తుంది. వేపాకులు ఇంటి నుంచి బొద్దింకలు, ఇతర క్రిములను నిర్మూలించడానికి ప్రభావంతంగా పనిచేస్తుంది. బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో వేపాకులు ఉంచండి. రోజూ ఈ ఆకులను మారుస్తూ ఉండండి. మూడు రోజుల్లో మీరు రిజల్ట్స్ను చూడొచ్చు. బొద్దింకల గుడ్లను చంపడానికి.. వేపనూనెలో కొంచెం వేడి నీళ్లు వేసి స్ప్రే చేయండి.బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట స్టికీ టేప్ పెట్డండి. దాని వాసనకు ఎట్రాక్ట్ అయి వచ్చి అతుక్కుంటాయి. ఇలా కొన్ని రోజుల పాటు డైలీ చేస్తే.. బొద్దింకల సమస్య పరిష్కారం అవుతుంది.ఇంట్లో బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో బోరిక్ పౌడర్ను చల్లాలి. దీని వల్ల కూడా బొద్దింకలు రాకుండా చూసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: