మనం ప్రతిరోజు తీసుకునే ఎన్నో వంటకాలలో ఉల్లిపాయ అనేది చాలా ముఖ్యమైనది. మనం ప్రతినిత్యం కూరగాయలు, బిర్యానీలు, చిరుతిళ్లు ఏది చేసినప్పటికీ కూడా వాటిలో ఖచ్చితంగా ఉల్లిపాయని  వాడుతాము.ఆహారంలో ఉల్లిపాయను వాడడం వలన ఆహార రుచి అనేది రెట్టింపు అవుతుంది. అయితే ఒక నెలపాటు ఈ ఉల్లిపాయలను తీసుకోకుండా ఉంటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం…ఒక నెల రోజులపాటు ఉల్లిపాయ తినడం పూర్తిగా మానేసినట్లయితే మలబద్ధకం నుండి కంటిచూపు దాకా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్యం నిపుణులు. ఎందుకంటే.. ఈ ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉల్లిపాయ ఎంతో సహాయం చేస్తుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ సి, విటమిన్ బి6 లాంటివి ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. ఈ ఫోల్లెట్ తో పాటు రొగరోధక వ్యవస్థ, కణాల పెరుగుదల ఇంకా జర్ణక్రియ ప్రక్రియను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. 


అలాగే అల్లిసీన్, క్వెర్సెటిన్ లాంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్ ఇంకా యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నియంత్రించడానికి ఇంకా అలాగే దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాలను నియంత్రించడంలో కూడా  సహాయపడుతుంది.ఉల్లిపాయలో ఎక్కువ మొత్తంలో డైటరీ,ఫైబర్ అనేవి ఉంటాయి. ఇది ఆరోగ్యమైన జీర్ణవ్యవస్థకు చాలా ముఖ్యం. అందువలన వాటిని తినడం మానడం వలన అజీర్ణం తో పాటుగా మలబద్దకం లాంటి సమస్యలు వస్తాయి. ఇవి మాత్రమే కాక ఉల్లిపాయను తీసుకోకపోవడం వల్ల విటమిన్ సి,విటమిన్ b6,ఫోలేట్ లోపంతో పాటుగా మాంగనీస్, పొటాషియం ఇంకా ఖనిజాలు రోగనిరోధక శక్తిని బలహీనంగా చేస్తాయి. దీని ఫలితంగా శరీరంలో అలసట కూడా పెరుగుతుంది. ఇంకా అలాగే ఎర్ర రక్త కణాలు కూడా ఏర్పడతాయి. అంతేకాకుండా రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. అయితే ఉల్లిపాయలు పూర్తిగా మానెయ్యకుండా తక్కువ పరిమాణంలో తీసుకోవటం మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: