నేటి కాలంలో చాలామంది బయట ఆహారాన్ని తిని అనేక రకాల వ్యాధులు తెచ్చుకుంటున్నారు. చాలామంది ఇంట్లో వండుకునే సమయం లేక బయటి ఆహారాన్ని తింటారు. ఇక మరికొందరేమో ఇంట్లో ఆహారం తినడం ఇష్టం ఉండక బయట ఆహారాన్ని తింటారు. అలా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు ఉపయోగిస్తారు. చాలామంది పానీపూరిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక ముఖ్యంగా అమ్మాయిలకైతే పానీపూరి అంటే విపరీతమైన ఇష్టం.


ఇక పానీపూరిని తినడం వల్ల అనేక రకాల వ్యాధులు సంభవిస్తున్నాయని వైద్య నివేదికలో వెళ్లడైంది. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో పానీపూరిని అసలు తినకూడదు. వర్షాకాలం వ్యాధులకు నిలయం. వర్షాలు పడిన సమయంలో పానీపూరి బండి రోడ్డు పక్కన ఉంటుంది. కాబట్టి వర్షపు నీరు అందులోకి చేరుతుంది. ముఖ్యంగా మురికి కాలువలపైన అనేక రకాల ఈగలు వాలుతాయి. అవి బయట అమ్మే ఆహారాలపైన వాలుతాయి. దానివల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి.


ఇక ముఖ్యంగా పానీపూరిలో కెమికల్స్ కలపడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని వెళ్లడైంది. ఇందులో ఎక్కువగా ఫుడ్ కలర్స్ వాడుతున్నారని ....ఆ కలర్స్ వల్ల కడుపులోని పేగులు చిట్లిపోతున్నాయని చెబుతున్నారు. అందుకే పానీపూరిని తినడం తగ్గిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని.... తద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.



ఇక వర్షాకాల సమయంలో పానీపూరి తినడం వల్ల జ్వరం వంటి వ్యాధులు వస్తాయి. ఈగలు వ్యాప్తి చెందిన పానీపూరి ఆహారాన్ని తినడం వల్ల టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇంకా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని బయట ఆహారాన్ని తినకపోవడం మంచిది. కాబట్టి...పానీపూరి తినేటప్పుడు కాస్త ఆలోచించి.. తినాలి. తినాలి అని కచ్చితంగా అనిపించినప్పుడు ఇంట్లో కూడా చేసుకోని తినవచ్చును.

మరింత సమాచారం తెలుసుకోండి: