ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బులతో సంభవిస్తున్న మరణాల్లో రెండో స్థానంలో భారత్ ఉంది. మన దేశంలో గుండె జబ్బులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. విచ్చలవిడిగా ప్రాసెస్ట్ చేసిన ఆహారం తీసుకోవడం, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తినడం, మద్యపానం, ధూమ పానం, స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం ఎక్కువ గంటలు కూర్చొని పని చేయడం, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిళ్లు.. ఇలా వివిధ కారణాల వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయి.


గతంలో వృద్ధుల్లో మాత్రమే గుండె పోట్లు సంభవించేవి. కానీ ఇప్పుడు 17-18 ఏళ్ల యువకుల్లోను, 15 ఏళ్ల విద్యార్థుల్లోను గుండె పోటు మరణాలు చోటు చేసుకోవడం ఆందోలన కలిగిస్తోంది. అలాగే గతంలో ఎక్కువగా పురుషులు మాత్రమే గుండెపోటు బారిన పడే వారు. కానీ ఇప్పుడు మహిళల్లోను గుండె పోటు మరణాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గెండు జబ్బులు, సంబంధిత వ్యాధులు సీవీడీ పెరుగుదలతో భారతదేశం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పాశ్యాత్య దేశాల్లోని ప్రజల కంటే భారతీయులు 10 ఏళ్లు ముందుగా ఈవ్యాధులను ఎదుర్కొంటారని వివిధ సంస్థల అంచనాలు అందరిలో గుబులు రేపుతున్నాయి.


ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా గుండె జబ్బులు నిలుస్తున్నాయి. ఈ గణాంకాలకు సంబంధించి భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఏటా మన దేశంలో 20శాతం కంటే ఎక్కువ మంది పురుషులు, 17శాతం మంది మహిళలు గుండె సంబంధిత వ్యాధులతో తమ ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు.


ప్రపంచంలోని ఇతర దేశస్తులతో పోలిస్తే భారతీయుల కరోనరీ ఆర్డిరీ డీసీజ్ వల్ల చనిపోయే ప్రమాదం 20-50శాతం ఎక్కువగా ఉందని గుండె వైద్యులు తేల్చి చెబుతున్నారు. గత 30 ఏళ్లలో భారతదేశంలో గుండె సంబంధిత మరణాలు, దానికి సంబంధించి వైకల్యాల బారిన పడిన వారి సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. ఆందోళనకర అంశం ఏంటంటే… భారతీయులు పాశ్చాత్య దేశాలలో కంటే ఒక దశాబ్ధం ముందుగానే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: