బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారా..?  పొట్ట కొవ్వును తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారా..? సన్నగా మారాలని పొట్ట తగ్గాలని ఆరాటపడుతున్నారా..?అయితే మీకు తమలపాకు ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది . తమలపాకు అనగానే దాదాపు అందరికీ తాంబూలం గుర్తుకు వస్తుంది. అలాగే ఇంట్లో ఏదైనా పెళ్లిళ్లు జరిగినా.. శుభకార్యం జరిగినా.. పూజ జరిగినా.. తమలపాకులు ఉండాల్సిందే. ఆయుర్వేద వైద్యంలోనూ తమలపాకులను వినియోగిస్తారు. తమలపాకు ఎంతో శక్తివంతమైన ఆకు. ఆరోగ్యపరంగా మనకు తమలపాకు అనేక రాకలైనా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఎన్నో జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.పొట్ట కొవ్వును కరిగించే సత్తా కూడా తమలపాకుకు ఉంది. అందుకోసం తమలపాకును ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక ఫ్రెష్ తమలపాకు తీసుకుని తొడిమ తొలగించాలి. ఆ తర్వాత  నాలుగు నుంచి ఐదు మిరియాలు తమలపాకులో పెట్టి చుట్టాలి. ఇప్పుడు ఈ తమలపాకును నోట్లో వేసుకుని బాగా నమిలి తినేయాలి. 


తినేసినా తర్వాత ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు కనుక చేశారంటే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.తమలపాకు మరియు మిరియాల కాంబినేషన్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును చాలా వేగంగా కరిగిస్తుంది. బాన పొట్టను కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుస్తుంది. పొట్టను తగ్గించుకొని  సన్నగా,నాజుగ్గా మారాలనుకునేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా తమలపాకును తీసుకోండి. పైగా తమలపాకులో యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ అల్సర్ లక్షణాలు ఎన్నో ఉన్నట్లు కనుగొనబడింది.అందువల్ల తమలపాకును నిత్యం తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బుల నుండి బయటపడొచ్చు. తమలపాకులో అనేక యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నోటి దుర్వాసన, దంతాల పసుపు,చిగుళ్ల పగుళ్ళు,ఫలకం మరియు దంత క్షయం నుండి ఉపశమనం కలిగిస్తాయి. తమలపాకులను నమలడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనంపొందవచ్చు. మరియు శరీరం  మనస్సుకు,  విశ్రాంతిని  సైతం తమలపాకులు అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: