ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెకేషన్ వంటి వాటికీ వెళ్లడానికి కూడా మక్కువ చూపుతూ ఉంటారు. మరి కొన్ని పరిస్థితులలో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కొంత మంది జర్నీ అంటే భయపడిపోతూ ఉంటారు. అందుకు కారణం జర్నీ సమయంలో ఎక్కడ వాంతులు వస్తాయో అని భయపడుతూ ఉంటారు. మరి కొంత మందికి బస్సులు ఇంకొందరు మందికి కార్లు, రైళ్లలో ప్రయాణం చేస్తే వాంతులు అవుతూ ఉంటాయి.. ఈ కారణం చేత ప్రయాణించాలంటే కాస్త ఆందోళన చెందుతూ ఉంటారు ప్రజలు. ఇలాంటి వారి కోసం ఇప్పుడు కొన్ని టిప్స్ తెలుసుకుందాం.


వాంతులు నివారించడానికి ఎన్నో రకాల పద్ధతులను మనం అనుసరిస్తూ ఉంటాము.. కొన్ని సందర్భాలలో అవి పెద్దగా పనిచేయవు ఇప్పుడు మనం చెప్పుకుబోయే పద్ధతులను పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట. ఎల్లప్పుడూ కారు లేదా బస్సు ప్రయాణించేటప్పుడు ముందు భాగంలో కూర్చోవాలి.. విమానాలు ,బస్సులు రైళ్లల్లో విండో సీటును ఎంచుకోవడం చాలా మంచిది.. అయితే అలా సీటు ఎంచుకున్న తర్వాత కళ్ళు మూసుకొని పడుకోవడం నిద్రపోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా ఆలోచించడం జరగదు.


అలాగే తరచు నీరు పుష్కలంగా త్రాగుతూ వాహనంలో మంచి వెంటిలేటర్ ఉండేలా చూసుకొనే ప్రాంతం వైపు కూర్చోవాలి.. కార్లలో కూర్చున్నప్పుడు ఎక్కువగా ఫోన్ చూడడం లాంటివి చేయకూడదు. అలాగే ప్రయాణానికి ముందు లేదా ఆ తర్వాత ఎక్కువగా భోజనం తినకూడదు మితిమీరిన లేదా కారంగా ఉండే ఆహారాలను తింటే చాలా ప్రమాదమే.. ముఖ్యంగా ఏవైనా పాటలు వింటూ కాస్త కాలక్షేపంగా ముందుకు వెళితే ప్రయాణం సుఖంగా సాగుతుంది.. అయితే ఏదైనా తినాలనిపించినప్పుడు కేవలం అల్లము లేదా మిఠాయి వంటివి తినడం మంచిది. ఇలా చేయడం వల్ల వాంతులు రాకుండా అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: