మహిళలను తీవ్రంగా వేధించే ఎండోమెట్రోయోసిస్ సమస్యను జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త విరుగుడును కనుగొన్నారు. ఇందుకోసం ఒక హైడ్రోజెల్ ఇంప్లాంట్ ను అభివృద్ధి చేశారు. ఇది గర్భ నిరోధక సాధనంగా కూడా అక్కరకు రావడం విశేషం. మహిళల్లో 10 శాతం మందిని ఎండోమెట్రోయోసిస్ వేధిస్తుంటుంది. ప్రతి నెల రుతు క్రమంలో భాగంగా గర్భాశయంలో లోపల ఎండోమెట్రియం పొర వృద్ధి చెందుతుంటుంది. అయితే కొందరిలో ఇది గర్భాశయం వెలుపల,పైవైపు గోడల మీద కూడా పెరుగుతూ సమస్యాత్మకంగా తయారవుతుంది. దీన్నే ఎండోమెట్రోయోసిస్ అంటారు. ఇది దేనివల్ల ఉత్పన్నం అవుతుంది అన్న దానిపై స్పష్టత లేదు.


అయితే రుతుక్రమం సమయంలో రక్తం.. ఫలోపియన్ ట్యూబ్స్ గుండూ ఉదర కుహరంలోకి ప్రవహిస్తుంటుందని.. ఆ రక్తంలో ఎండో మెట్రియం కణాలు ఉంటాయని భావిస్తున్నారు. అవే గర్భాశయం వెలుపల పెరుగుతుంటాయని అంచనా వేస్తుంటారు. దీనివల్ల ఇన్ఫ్లమేషన్, నొప్పి, స్కార్ కణజాలం ఏర్పడుతుంటాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇది ఎండోమెట్రోయోసిస్ కు దారి తీస్తుందన్న అభిప్రాయం ఉంది. దీనివల్ల నెలసరి సమయంలో పొత్తి కడుపులో తీవ్ర నొప్పి, ఇతర సమస్యలు వస్తాయి.


హైడ్రోజల్ ఒక రకం ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. అది నీటితో బంధాన్ని ఏర్పరుస్తుంది. కాంటాక్ట్ లెన్స్ ల తయారీ, శరీరంలో మందులు బట్వాడా, మాయిశ్చరైజర్ల తయారీ, నేలలో నీటి నిల్వ, కలుషిత నీటి శుద్ధి అవసరాలకు అది ఉపయోగపడుతుంది. ఈటీహెచ్ జ్యూరిక్, ఎంపీ శాస్తవేత్తలు ఈ హైడ్రోజెల్స్ పై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. హైడ్రోజల్ సాయంతో మహిళలకు గర్భనిరోధక సాధనాన్ని తయారు చేయాలన్నది లక్ష్యం.


ఇందుకోసం.. ఈ హైడ్రోజెల్ను గర్భంలోకి ప్రవేశ పెట్టి ఫలోపియన్ ట్యూబ్ లను గర్భంలోకి ప్రవేశపెట్టి ఫలోపియన్ ట్యూబ్ లను మూసుకుపోయేలా చేయాలనుకున్నారు. దీనిపై స్త్రీ వైద్య నిపుణులతో చర్చించినప్పుడు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. హైడ్రోజల్ ను ప్రవేశపెట్టడం ద్వారా ఎండోమెట్రోయోసిస్ ను కూడా నివారించొచ్చని గుర్తించారు. ఇది హానీకారకం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో వద్దనుకున్నప్పుడు హైడ్రోజెల్ ను ఇంప్లాంట్ ను తొలగించడం సులువు. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం కూడా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: