ఆహారాల్లో ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

కూరల్లో ఎక్కువగా ఉప్పు వేసుకొని భోజనం చెయ్యడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. అయితే దీంతో ఖచ్చితంగా ఆరోగ్యానికి చాలా అనర్ధాలు ఉన్నాయి. కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు వినియోగాన్ని తగ్గించడం ద్వారా ముఖ్యంగా ఉప్పగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసాలను తీసుకోవడం తగ్గించాలి. తద్వారా కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఎక్కువ ఉప్పు తీసుకోడానికి కాల్షియం విసర్జనకు సంబంధం ఉంటుంది. ఇది కాలక్రమేణా ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది ఖచ్చితంగా బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు దారితీస్తుంది. సోడియం తగ్గించడం ద్వారా కాల్షియం స్టోరింగ్ అనేది మెరుగుపడుతుంది. ఎముక సాంద్రతను పెంచుతుంది. దాంతో ఎముక పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అధిక సోడియం వినియోగం మూత్రపిండాలపై భారం పడుతుంది. మూత్రపిండాలు దెబ్బతినడానికి, కాలక్రమేణా పనిచేయకపోవడానికి దారితీస్తుంది.


ఎక్కువ ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే ఈ భారాన్ని తగ్గించవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.హైబీపీ అనేది స్ట్రోక్‌కు ప్రధాన కారణం. సోడియం తీసుకోవడం తగ్గించాలి. తత్ఫలితంగా రక్తపోటును తగ్గించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మెరుగైన ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువును పొందవచ్చు.అధిక రక్తపోటు గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. అందువల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. సోడియం తీసుకోవడం తగ్గించాలి. దాంతో గుండె పనితీరు బాగా మెరుగ్గా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఈజీగా తగ్గిస్తుంది.సోడియం లేదా ఉప్పు బాగా ఎక్కువగా తీసుకోవడం వల్ల హైబీపీ వస్తుంది. తినే కూరల్లో ఉప్పుని తగ్గిస్తే రక్తపోటు స్థాయిలు కూడా ఈజీగా తగ్గుతాయి. గుండెపోటు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తినే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. లేకుంటే ఖచ్చితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: