ఇప్పుడు చెప్పే పండ్లు బయట మార్కెట్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ వీటిని చాలా మంది కూడా అసలు పట్టించుకోరు. ఈ పండ్లని నెక్టారిన్స్ అంటారు. ఇవి రెయిన్ సీజన్‌లో మనకు ఎక్కువగా లభిస్తాయి.ఇవి తీపి, పులుపు రుచిగా ఉంటాయి. సూపర్ మార్కెట్లలో మనకు ఇవి ఏడాది పొడవునా లభిస్తాయి. 2 వేల ఏళ్ల కిందట చైనాలో మొదటగా ఈ పండ్లను పండించారట. ఆ తరువాత ఇవి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయి. అయితే పీచ్ పండ్లకు, వీటికి చాలా పోలికలనేవి ఉంటాయి. అందువల్ల వీటిని చూసి చాలా మంది పీచ్ పండ్లు అని అనుకుంటారు. పీచ్ పండ్లకు, నెక్టారిన్లకు తొక్క వేరేగా ఉంటుంది. అందువల్ల వీటిని ఈజీగా గుర్తించవచ్చు. ఇక నెక్టారిన్స్ పండ్లను తినడం వల్ల మనకు చాలా లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ నెక్టారిన్ పండ్లను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. ఎందుకంటే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను ఈజీగా నిర్మూలిస్తాయి. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.


ఇంకా అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి ఈ పండ్లు మీకు బయట ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా కొని తెచ్చుకోని తినండి. వీటిని తినడం వల్ల చాలా రకాల లాభాలను పొందవచ్చు.ఈ పండ్లలో విటమిన్ ఎ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరచడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిల్లో ఉండే విటమిన్ సి రోగాలు రాకుండా చూస్తుంది. అలాగే నెక్టారిన్స్‌ను తింటే పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.నెక్టారిన్స్ పండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే మన శరీరానికి పోషణ లభిస్తుంది. అందువల్ల అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే ఫైబర్ అధిక బరువును తగ్గించుకునేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా బాగా మెరుగుపరుస్తుంది. దీంతో గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం సమస్యలు ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: