పాలు, పాల ఉత్పత్తుల వల్ల కలిగే లాభాలు, నష్టాలివే?

ఈ కాలంలో చాలామందికి పాలు,పెరుగు తినడం, తాగడం అస్సలు ఇష్టం ఉండదు చాలా వరకు తగ్గించేస్తున్నారు. మరి కొంతమంది పాలు పెరుగు రెండు బాగా ఇష్టంతో తీసుకుంటూ ఉంటారు.ముఖ్యంగా పాలతో తయారుచేసిన కాఫీ టీ వంటివి  ఉదయం, సాయంత్రం ఎక్కువగా తాగుతూ ఉంటారు. పెరుగు లేదా మజ్జిగ చాలా తక్కువగా మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అయితే నిజానికి పాలు పెరుగు తినకుండా, తాగకుండా చాలామంది ఉండలేరు. అలాంటిది కొద్ది రోజుల పాటు పాలు పెరుగు తినడం మానేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


పాలు, పాల ఉత్పత్తుల్లో లాక్టోస్ పుష్కళంగా ఉంటుంది. అలాగే క్యాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది. పాలు అలాగే పెరుగు ఈ రెండు కూడా పాల ఉత్పత్తులతో వచ్చేవి. అయితే మనలో చాలామందికి పాలలో ఉండే ఈ లాక్టోస్ నచ్చదు. దాని వల్ల రోజు నెమ్మదిగా పాలు, పాల ఉత్పత్తులను తినడం మానేస్తారు. మామూలుగా పాలను తీసుకున్న తర్వాత చర్మం లో అదనపు నూనె ఉత్పత్తిని అనుభవించవచ్చు. ఇది మొటిమలకు దోహదం చేస్తుంది. కాబట్టి పాలను వదిలేయడం ద్వారా ఆరోగ్యకరమైన, నిగారింపు గల చర్మాన్ని పొందవచ్చు. ఇది చర్మంలో మంటను తగ్గించడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే లాక్టోస్ అనేది ఒక సహజ చెక్కర.కాబట్టి దీనిని మానేయడం వల్ల కొంతపరిమాణం బరువు తగ్గవచ్చు. ఇది చక్కెరతో కూడిన పాల ఉత్పత్తుల వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. మరి పాలు పెరుగు మానేయడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 


డైరీని నివారించడం అన్నది కష్టం. లాక్టోస్ అనేక పదార్థాలు, ఆహార పదార్థాలలో ఉంటుంది. పాలు, పాల ఉత్పత్తులను నివారించడం ప్రారంభంలో చాలా సవాలుగా ఉంటుంది. అలాగే పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం , ప్రొటీన్లు కాకుండా అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పోషకాహార అంతరాన్ని పూరించడానికి మీకు సప్లిమెంట్లు అవసరం కావచ్చు. పాలు, పాల ఉత్పత్తులలో ఉండే పోషకాలు మీ సమతుల్య ఆహారంలో భాగంగా ఉండాలి. బాగా ప్రణాళికా బద్ధంగా లేకపోతే, డైరీ ఫ్రీకి వెళ్లడం పోషకాహార లోపాలను ప్రేరేపిస్తుంది. అలాగే ఎలాంటి ఎలర్జీ సమస్యలు లేనివారు పాలు, పాల ఉత్పత్తులు మానేయకపోవడమే మంచిది. ఎందుకంటే పాలల్లో మన శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు ఉంటాయి.కాబట్టి పాలను మానివేయడం కన్నా తీసుకోవడమే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: