గుమ్మడికాయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇంటి వెనకాలా తీగ అల్లుకుని పసుపు పచ్చటి పూలతో విరివిగా కాస్తుంటాయి.కానీ మనం వీటిని అసలు తినకుండా లైట్‌ తీసుకుంటాం. దీన్ని ఎక్కువగా దిష్టి తీయడానికి వాడుతూ ఉంటాము. అయితే ఈ బూడిద గుమ్మడి కాయతో మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు పుష్కలంగా అందుతాయని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు దాని ప్రయోజనాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.ఈ బూడిద గుమ్మడికాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.ఇంకా అంతేకాదు కొవ్వు పదార్థాలు కూడా తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం అవుతుంది. ఈ బూడిద గుమ్మడి కాయ ప్రేగు కదలికలను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికే కాకుండా సౌందర్య పరంగా కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ బూడిద గుమ్మడి కాయ చర్మం నిగారింపుకు, జుట్టు కోసం, వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి, చుండ్రును నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.


అధిక రక్తపోటుతో బాధపడే వారు ఈ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు ఈ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకోవడం వల్ల మంచి నిద్ర పొందవచ్చు. రోజుకు మూడు గ్లాసుల బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో పాటు ఇతర మూత్రపిండాల సమస్యలు కూడా తగ్గుతాయి.పొట్టలో అల్సర్లు తగ్గుతాయి. కడపులో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. నిత్యం ఈ జ్యూస్‌ తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వైరస్లు, బ్యాక్టీరియల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ జ్యూస్‌లో అధికంగా ఉండే విటమిన్ సీ, బీటా కెరోటిన్‌లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. ఆందోళన, ఒత్తిడి వంటి వాటితో బాధపడే వారు ఈ జ్యూస్ ను ప్రతిరోజూ తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.మలబద్దకం, గ్యాస్‌, అజీర్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీటిలో ఉండే కాల్షియం మన ఎముకలను దృఢంగా తయారుచేస్తుంది. రక్తహీనత నుంచి బయటపడేందుకు వీటిలోని ఐరన్‌ సాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: