వర్షాకాలంలో  మనం తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలా రకాల సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా చిరు ధన్యాలు,పప్పుధాన్యాలు ఆరోగ్యానికి మంచిదని తినేస్తుంటాం. కానీ ఈ వర్షాకాలంలో ఇలాంటివి అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కారణాలేంటో ఎందుకు వీటిని వర్షకాలంలో తీస్కుకోకూడదో చూద్దాం. పప్పుధాన్యాలు ఆరోగ్యకరమైనవే అయినా వర్షాకాలంలో మాత్రం ఇలాంటి పప్పులకు దూరంగానే ఉండాలి. వాతావరణంలోని తేమ శరీరంలోని జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గ్యాస్‌, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది. మరీ ముఖ్యంగా బీన్స్‌, కాయధాన్యాలు, చిక్‌పీస్‌, బఠానీలు వంటి పప్పుధాన్యాలకు ఎక్కువ దూరంగా ఉండాలి. వర్షాకాలం వచ్చింది అంటే చాలు చాల రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అంటువ్యాధులు, వైరస్, ఇన్ఫెక్షన్లు వంటి అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. 

 వర్షాకాలంలో కొన్ని రకాల పప్పులు, దినుసులు తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల పప్పులు తినడం వల్ల శరీరంలో చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందువ్లల గ్యాస్, కడుపులో మంట, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి చాలా కడుపు సంబంధింత సమస్యలు తలెత్తుతాయి. పప్పుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఫైబర్ ఎక్కువైనా కూడా సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల రాజ్మా, శెనగలు, పెసర్లు వంటి పప్పులకు దూరంగా ఉంటే మంచిది.

 సెనగపప్పులో ప్రోటీన్‌, ఫైబర్‌, మినరల్స్‌ పుష్కళంగా ఉంటాయి. ఇవి అజీర్ణం, అపానవాయువుకి దారితీస్తుంది. సెనగపప్పు బరువు నిర్వహణలో, కొలస్ట్రాల్‌ను నియంత్రించడం తోపాటు మొత్తం జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మసూర్‌ పప్పు లేదా ఎర్ర పప్పులో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు సీ, బీలు అధికంగా ఉన్నాయి. అయినప్పటికీ దీనిలో ఉండే రాఫినోస్, స్టాకియోస్ వంటి చక్కెరలు మన శరీరంలో జీర్ణం కావడం కష్టమవ్వడం వల్ల ఇది అపాన వాయువుకు కారణమవుతుంది.మినపప్పు ఎముకల ఆరోగ్యానికి మద్దతునిస్తుంది, శక్తిని పెంచుతుంది. ఇది పొట్టపై భారంగా ఉంటుంది. జీర్ణంమవడం కష్టమవుతుంది. ఇది తేమతో కూడిన వాతావరణంలో అసౌకర్యం,ఉబ్బరానికి దారితీస్తుంది. వర్షాకాలంలో రోజూ వేయించిన ఆహారాన్ని తినకుండా ఉండటం చాలా అవసరం. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆ ఒత్తిడి అనేది గుండె పై అధికంగా ఏర్పడుతుంది.కాబట్టి ఈ వర్షాకాలంలో పప్పు దినుసులు, చిరు ధాన్యాలు తగ్గించుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: