కిడ్నీళ్ళో రాళ్లు ఉన్నవారు కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తినే ఆహారంలో ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలి. లేదంటే కచ్చితంగా చాలా నష్టపోతారు. ఈ సమస్య ఉన్నవారు శరీరాన్ని కచ్చితంగా హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే వీళ్లు నీటిని పుష్కలంగా తాగడంతో పాటుగా ఇతర ద్రవాలను కూడా కచ్చితంగా తాగాలి. వీళ్లు ప్రతిరోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి.అలాగే వీళ్లు కాల్షియాన్ని కూడా పుష్కలంగా తీసుకోవాలి. ఇందుకోసం పాల ఉత్పత్తులు, ఆకుకూరలను బాగా తినాలి. మీరు కాల్షియాన్ని తక్కువగా తీసుకుంటే మీ మూత్రంలో ఆక్సలేట్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాలను తినండి. ఇక సోడా టేస్టీగా ఉంటుంది. కానీ ఇది మీ మూత్రపిండాల్లో రాళ్ల సైజును మరింత పెంచుతుంది. ఈ సోడాలో ఉండే ఉండే ఫాస్బారిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ఏర్పడటాన్ని మరింత పెంచుతుంది.కాబట్టి దీన్ని తీసుకోవద్దు.సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఈ సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. వీటిని ఎక్కువగా తింటే ఆక్సలేట్ ఉత్పత్తి పెరుగుతుంది. 


దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఏర్పడితే వీటిని తినడం మానేయండి. ఉప్పును చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మూత్రపిండాల్లో రాళ్లు మరింత పెరుగుతాయి. అదనపు సోడియం కాల్షియం ఏర్పడటాన్ని పెంచుతుంది. అందుకే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్ వంటివి తినకూడదు.కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు పొరపాటున కూడా ఆల్కహాల్ ను తాగకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో వాటర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది.  కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు రెడ్ మీట్ వంటి మాంసాహారం అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి మూత్రంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను పెంచుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. అలాగే వీళ్లు స్వీట్లు, కెఫిన్ ను కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి కూడా మూత్రంలో కాల్షియం లెవెల్స్ ను పెంచి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కూడా దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: