పరగడుపున ఈ డ్రింక్ తాగితే ఎంతటి పొట్టయినా కరగాల్సిందే? 

 ప్రస్తుత కాలంలో మనం తినే ఆహారం కారణంగా ఇంకా ఇతర కారణాల వల్ల చాలా మంది ఊబకాయానికి గురవుతున్నారు.బెల్లీఫ్యాట్‌ సమస్యని చాలామంది ఎదుర్కొంటున్నారు. దీనిని తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునేందుకు సూపర్ డ్రింక్‌ను సజెస్ట్‌ చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక దీనిని తీసుకోవడం వల్ల జీవక్రియ బాగా పెరుగుతుంది. ఈ డ్రింక్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ కరిగించడంలో సాయపడుతుంది. ఈ డ్రింక్‌ ని మనం ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే కచ్చితంగా మంచి ఫలితం ఉందంటున్నారు. ఈ డ్రింక్‌ ని తయారు చేసుకోడానికి ఒక లీటరు మంచినీళ్లు, ఒక కీర దోసకాయ, ఒక నిమ్మకాయ, ఒక స్పూను అల్లం తురుము ఇంకా ఓ పది పదిహేను పుదీనా ఆకులు ఉంటే చాలు. లీటరు నీటిలో దోసకాయను శుభ్రంగా కడిగి వాటిని ముక్కలు చేసి వేయండి. ఇంకా అలాగే నిమ్మకాయను కూడా గుండ్రంగా చక్రాల్లాగా కోసి వాటిని నీటిలో వేయండి. ఇంకా అలాగే అల్లం సన్నగా తురిమి ఒక స్పూను దాకా వేయండి. తరువాత పుదీనా అకులు కూడా వేసి బాగా కలపండి.


ఆ తరువాత ఈ నీటిని రాత్రంతా కూడా ఫ్రిజ్‌లో ఉంచండి. ఆ మర్నాడు ఈ నీటిని తీసుకొని దాహం వేసినప్పుడల్లా తాగండి. అయితే పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగితే ఇంకా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ డ్రింక్ తాగితే మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది. కొవ్వులని కరిగించి మూత్రం ద్వారా బయటికి పంపుతుంది. వేగంగా బరువు తగ్గడంలో సాయపడుతుంది. ఈ డ్రింక్‌లో నిమ్మరసం కలుపుతారు కనుక దీని వల్ల బరువు తగ్గుతారు. నిమ్మలో సహజ మూత్ర విసర్జన లక్షణాలు, ఆల్కలీన్ లక్షణాలు ఉన్నాయి. ఇవి pH స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులోని అల్లం ఈ పానీయానికి మంచి వాసన, రుచిని అందిస్తుంది. ఈ డీటాక్స్ డ్రింక్ పరగడుపున తాగితే మూత్ర విసర్జన ద్వారా శరీరం నుండి అదనపు నీటిని బయటికి పంపుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. లివర్ హెల్దీగా మారుతుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. డీటాక్స్ చేస్తుంది. శరీరానికి, నోటికి మంచి బూస్టింగ్ ఉంటుంది. పుదీనా ఆకులు పొట్టని మృదువుగా ఉంచుతాయి. ఇది నోటిని కూడా రీఫ్రెష్ చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. జీర్ణక్రియని మెరుగుపరచడంలో సాయపడుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: