పొద్దు తిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ విత్తనాలను తినడం వల్ల మీకు డైటరీ ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో ప్రతి రోజూ కూడా సుఖ విరేచనం అవుతుంది. ఇంకా అలాగే మలబద్దకం నుంచి కూడా మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఈ సీడ్స్‌ను ప్రతి రోజూ కూడా తినడం వల్ల ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు.అయితే వీటిని మాత్రం కచ్చితంగా ఉదయాన్నే తినాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.ఇక పోతే ఈ పొద్దు తిరుగుడు విత్తనాల్లో బి విటమిన్లు చాలా సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ బి1 (థయామిన్‌) అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ సీడ్స్‌ను తింటే మన శరీర మెటబాలిజం అనేది పెరుగుతుంది. దీంతో క్యాలరీలు చాలా వేగంగా ఖర్చయి కొవ్వు కరుగుతుంది. దాని ఫలితంగా అధిక బరువు కూడా తగ్గుతారు. ఇంకా అలాగే ఈ విత్తనాల్లో ఉండే విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని బాగా మెరుగు పరుస్తుంది. దీంతో మన మెదడు ఎంతో చురుగ్గా ఇంకా యాక్టివ్‌గా కూడా పనిచేస్తుంది. 


ఈ విత్తనాలను తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఈ విత్తనాలను తినడం వల్ల విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి కణాలు నాశనం కాకుండా చూస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.ఈ పొద్దు తిరుగుడు విత్తనాలను ఉదయం పూట తింటేనే మనకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందట. ముందు రోజు రాత్రి వాటిని ఒక గుప్పెడు మోతాదులో తీసుకుని నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని బ్రేక్‌ఫాస్ట్ కన్నా ముందు తినాలి. ఇలా పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విత్తనాల్లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ విత్తనాల్లో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: