ఊబకాయం చాలా డేంజర్. ఇది కచ్చితంగా అనేక రకాల సమస్యలని తెస్తుంది. కాబట్టి కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఊబకాయం నిద్రను ప్రభావితం చేస్తుంది. బరువు తగ్గడానికి కచ్చితంగా కనీసం 7 నుంచి 8 గంటల పాటు గాఢ నిద్ర అవసరం. మీకు తగినంత నిద్ర కనుక లేకపోతే, అది మీ జీవక్రియను నెమ్మదిస్తుంది. దీంతో బరువు తగ్గడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే  మంచి నిద్ర కోసం రాత్రి పుకునే ముందు పసుపు పాలు తాగడం అలవాటు చేసుకోంది. ఈ పసుపు పాలు బరువు తగ్గడానికి, మంచి నిద్రకు ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే పసుపులో కొవ్వును కాల్చడానికి సహాయపడే థర్మోజెనిక్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దీనితో పాటు, ఇది జీవక్రియను కూడా ఈజీగా పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ కూడా రాత్రి పడుకునే ముందు కచ్చితంగా ఒక గ్లాసు పసుపు పాలు తాగండి.ఇంకా ఊబకాయం తగ్గడానికి డిన్నర్‌లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని  కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా రాత్రిపూట మీరు పచ్చి కూరగాయలు, సూప్, సలాడ్, పప్పు తినవచ్చు. మీకు అర్థరాత్రి ఆకలిగా అనిపిస్తే, కీర దోసకాయ లేదంటే యాపిల్‌ వంటి పండ్లను తినొచ్చు. మనం త్వరగా నిద్రపోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్‌ని సృష్టించి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి బాగా నిద్రపోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.ఊబకాయం తగ్గాలంటే కచ్చితంగా రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య దాదాపు 3 గంటల గ్యాప్ ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట భోజనం చేయడం వల్ల జీర్ణం సరిగా జరగదు. దీంతో జీవక్రియ ప్రభావితం అవుతుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, సాయంత్రం త్వరగా తినడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే, రాత్రిపూట ఎల్లప్పుడూ లైట్‌ఫుడ్‌ తీసుకోవటం మంచిది అంటున్నారు.మీరు సులభంగా బరువు తగ్గాలనుకుంటే రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: