మనలో చాలా మందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ (UTI) సమస్య ఏదో ఒక సందర్భంలో వేధిస్తుంది. కొంత కాలం బాధ పెట్టే ఈ సమస్య ముఖ్యంగా మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది అలాగని పురుషులకు రాదని అర్థం కాదు మగవారికి కూడా ఈ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. మూత్రం చేసేటప్పుడు మంటగా అనిపించడం, తరచుగా మూత్రం చేయాలనిపించడం, యూరిబ్‌ చేయాలని అనిపించి వెంటనే వెళ్ళాలని అనిపించడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే UTI వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.

ప్రముఖ మూత్రపిండాల నిపుణులు Dr. P.S. వాలి చెప్పినట్లు, UTI నుంచి త్వరగా కోలుకోవడానికి కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి. అవేవో తెలుసుకుందాం.

* నీరు ఎక్కువగా తాగండి: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల మూత్రాశయంలోని బ్యాక్టీరియా బయటకు పోయి, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

* క్రాన్బెర్రీ జ్యూస్ తాగండి: క్రాన్బెర్రీ జ్యూస్ మూత్రాశయంలోని బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ మరింత తీవ్రం కాకుండా నిరోధిస్తుంది.

విటమిన్ సి: విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. విటమిన్ సి వల్ల మూత్రం కొంచెం ఆమ్లంగా మారుతుంది. దీంతో మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అని అర్థం.

పెరుగు: పెరుగులో ప్రోబయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా శరీరంలోని బ్యాక్టీరియాను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి. రోజూ పెరుగు తీసుకోవడం వల్ల UTI రాకుండా కాపాడుకోవచ్చు

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో బ్యాక్టీరియాను చంపే గుణాలు ఉన్నాయి. అంటే దాల్చిన చెక్కను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించి, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

వైద్యుల సలహా: ఈ ఇంటి చిట్కాలతో పాటు, డాక్టర్ చెప్పిన మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ ఇచ్చే యాంటీబయాటిక్స్ వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది. 


పైన తెలిపినవి పటిసే సరి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ నుంచి బయట పడవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: