అనంతరం, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత నిబంధనలకు మద్దతుగా కోర్టులో వాదించింది. అవి శాస్త్రీయంగా ఉన్నాయని పేర్కొంది.ఈ నియమం కారణంగా ఒక మహిళా ట్రాన్స్‌జెండర్ తన తండ్రికి రక్తదానం చేయలేకపోయారని తెలిపారు."ఆమె తండ్రికి ప్రతిరోజూ రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం ఎక్కించవలసి ఉంటుంది. దాత అందుబాటులో లేకపోవడంతో ఆయన రెండు రోజుల్లో మరణించారు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ అంత నిస్సహాయ స్థితిని చూడలేదు." అని బియోంకి అన్నారు.ఒక అంచనా ప్రకారం భారతదేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒకరికి రక్తమార్పిడి అవసరం. అలాంటి పరిస్థితిలో రక్తదానాన్ని పరిమితం చేసే నిబంధనలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.2021 అధ్యయనం ప్రకారం భారత్ ప్రతి సంవత్సరం 10 లక్షల యూనిట్ల కొరతను ఎదుర్కొంటుండగా...లాన్సెట్ అధ్యయనం ప్రకారం ఈ సంఖ్య 4 కోట్ల యూనిట్లకు దగ్గరగా ఉంది.వలసరాజ్యాల కాలంలో స్వలింగ సంపర్కంపై విధించిన నిషేధాన్ని కొట్టివేయాలని 2018లో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కృతజ్ఞతలు తెలిపింది. కానీ, ఇంకా కొన్ని ఇలాంటి నిబంధనలపట్ల నిరుత్సాహంగా ఉంది.