ఇక దోమలు మనుషులపై దాడి చేస్తున్న తీరు చూస్తుంటే మనుషులకి దోమలకి మధ్య ఏదో జన్మలో శత్రుత్వం ఉందేమో అన్న భావన కలుగుతూ ఉంటుంది. అంత దారుణంగా కనీసం కనికరం చూపించకుండా దోమలు కుడుతూ రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయి. ఇక ఇదే దోమలు ఎన్నో సీజనల్ వ్యాధులకు కూడా కారణం అవుతూ ఎంతో మందిని ఆసుపత్రిపాలు చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా అందరిని దోమలు కుడతాయి అన్న విషయం తెలుసు. కానీ కొంతమందిని మాత్రం ఏకంగా మరింత ఎక్కువగా దోమలు కుట్టడం చూస్తూ ఉంటాం. ఇలా కుట్టినప్పుడు నీ బ్లడ్ స్వీట్ గా ఉన్నటువంటి అందుకే దోమలు ఎక్కువగా కొడుతున్నాయి అని సరదాగా కామెంట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది జనాలు.
అయితే కొంతమంది వ్యక్తులను దోమలు మిగతా వారితో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగా కుడుతూ ఉండడానికి వెనక ఒక పెద్ద కారణమే ఉందట. మద్యం తాగిన వారు ఇలా తమను దోమలు ఎక్కువగా కుడుతుంటాయని చెబుతూ ఉంటారు. దీనికి గల కారణాన్ని జపాన్ లోని టోమాయ యూనివర్సిటీ బయో డిఫెన్స్ మెడిసిన్ విభాగం గుర్తించింది. ఇక్కడ నిపుణులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. బీరు తాగే వారిని దోమలు ఎక్కువగా కుడతాయట. బీరు తాగడం వల్ల శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతతో పాటు ఇక వారు విడుదల చేసే చెమట, co2 దోమలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయట. అందుకే మిగతా వారితో పోల్చి చూస్తే దోమలు బీరు తాగే వాళ్ళని ఎక్కువగా కుడుతూ ఉంటాయట. మరి మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా.