మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అలవాట్లలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. అయితే కొన్ని మార్పులు మంచి కోసమైతే ఇంకొన్ని మార్పులు మాత్రం ఎన్నో అనర్థాలకు కారణం అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా అనర్ధాలకు కారణం అవుతున్న మార్పులలో మద్యం తాగే అలవాటు కూడా ఒకటి. అదేంటి మనిషిలో మద్యం తాగే అలవాటు ఎన్నో దశాబ్దాల నుంచే ఉంది. ఇప్పుడు కొత్తగా రావడం ఏంటి అనుకుంటున్నారు కదా. ఒకప్పటితో పోల్చి చూస్తే ఇక ఇప్పుడు మనుషుల్లో మద్యం తాగే అలవాటు విపరీతంగా పెరిగిపోయింది.


 ఇదే ఇప్పుడు అనర్థాలకు కారణమైంది. ఒకప్పుడు మద్యం తాగే వారిని చూస్తే వాళ్ళు చెడ్డవాళ్లేమో అన్నట్లుగా సమాజంలో ప్రతి ఒక్కరు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే.. ఏదైనా ఫంక్షన్ లో ఎవరైనా మద్యం తాగట్లేదు అంటే చాలు ఇక ఇలాంటివారిని విచిత్రంగా చూడటం చేస్తూ ఉన్నారు. అంతలా మారిపోయింది కాలం తీరు. ఇక కొంతమంది అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా మద్యం తాగే అలవాటును చేసుకుంటున్నారు.  అయితే డాక్టర్లు ప్రతిరోజు రెండు పెగ్గులు తాగితే ఏం కాదని చెప్పారు అంటూ సాకు చెప్పుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలా ప్రతిరోజు మద్యం తాగే అలవాటు మాత్రం ముమ్మాటికీ ఆరోగ్యానికి చేటు చేస్తుందని వైద్య నిధులు హెచ్చరిస్తున్నారు.



 కొంతమంది అయితే క్రమం తప్పకుండా మద్యం తాగి తూగుతూ ఉంటారు. అయితే 60 ఏళ్ల తర్వాత రోజు ఆల్కహాల్ సేవిస్తే త్వరగా చనిపోతారని జామ నెట్ వర్క్ సర్వేలో వెళ్లడైంది. 1,35,103 మందిపై సర్వే నిర్వహించగా డైలీ డ్రింకింగ్ చేసే వాళ్లలో 33% అకాల మరణాన్ని పెంచుతుందని.. అంతేకాకుండా క్యాన్సర్ తో చనిపోయే ప్రమాదాన్ని కూడా 39% పెంచుతుందన్న విషయం తేలింది. మితంగా అప్పుడప్పుడు మద్యం సేవిస్తే మాత్రం కేవలం 10% మాత్రమే చనిపోయే ప్రమాదం ఉంది అన్న విషయం ఈ సర్వేలో బయటపడింది. అందుకే మద్యానికి దూరంగా ఉండి.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలని నిపుణులు  సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: