మంచినీళ్లు తాగే విషయంలో కొందరు తేలికపాటి తప్పులు చేస్తూనే ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తినేముందు, తిన్న వెంటనే అసలు నీళ్లు తాగకూడదు. దీనివల్ల జీర్ణసమస్యలు ఏర్పడతాయి. అరుగుదల కుంటు పడుతుంది. ఆహారం తినేటప్పుడు అసలు నీటిని తాగకూడదు. మిగతా సమయంలో నీటిని తాగాలి. నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. గటగట నీళ్లను తాగడం కన్నా నెమ్మదిగా తాగడం మంచిది.


మనకు దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం కూడా పెద్ద తప్పు. తరచూ నీళ్లు తాగితేనే శరీరానికి తగినంతగా తేమ అందుతుంది. చాలామంది చల్లటి నీరు త్రాగుతూ ఉంటారు. అలా తాగినట్లయితే జీర్ణ క్రియకు ఆటంకాలు ఏర్పడే సమస్య ఉంది. కాబట్టి సాధారణమైన నీటిని తాగడమే ఆరోగ్యానికి చాలా మంచిది. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తాగినట్లయితే ఎలక్ట్రోలైట్ సమస్య ఏర్పడుతుంది.


వాంతులు, తలనొప్పి వంటివి వస్తాయి. అపరిశుభ్రమైన నీరు తాగితే కచ్చితంగా అనారోగ్యం పాలవుతారు. చాలామంది ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని నింపి పెడుతూ ఉంటారు. అలాంటి వాటిలో నీరు తాగే బదులు గాజు లేదా రాగి సీసాలో నీరు తాగినట్లయితే చాలా మంచిది. ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని తాగినట్లయితే అది కొద్దికొద్దిగా కరిగి మన శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ బాటిల్స్ ను 15 రోజుల తర్వాత అస్సలు వాడకూడదు. కేవలం 15 రోజులు మాత్రమే ప్లాస్టిక్ బాటిల్స్ ని ఉపయోగించాలి. ఆ తర్వాత వాడినట్లయితే అనారోగ్యమేర్పడుతుంది.

ఇక మనం తినే సమయంలో కాకుండా మిగతా సమయాల్లో నీరు తాగడం చాలా మంచిది. అరగంటకు ఒకసారి అయినా నీటిని తాగుతూ ఉండాలి. ఇక పడుకునే సమయాల్లో నీటిని తక్కువగా తాగితేనే మంచిది. ఎక్కువగా నీరు తాగినట్లయితే పలుమార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. దానివల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు నీటిని తాగిన ఎలాంటి సమస్యలు ఉండవు.


మరింత సమాచారం తెలుసుకోండి: