చిన్న వయసులో కూడా ఎవరు పిల్లలకి మొబైల్ అలవాటు చేయకూడదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో వీలైనంతవరకు మాట్లాడడం చాలా మంచిది.
ఏదైనా ఆహారం తింటున్న సమయంలో పిల్లలకు మొబైల్ ఇవ్వకూడదు. ఇలా చేస్తే ప్రతిసారి కచ్చితంగా తినే సమయంలో మొబైల్ ఇవ్వమని గోల చేస్తూ ఉంటారు. తినే సమయంలో మొబైల్ ని దూరంగా ఉంచడమే ఉత్తమం.
పిల్లలు ఎక్కువ సైతం వీడియోస్ యూట్యూబ్ వంటివి చూస్తూ ఉంటారు కనుక ఎవరైనా పని పూర్తి చేసుకున్న తర్వాత మొబైల్ డేటా లేదా వైఫై ని ఆఫ్ చేయడం ఉత్తమం. వీటివల్ల మొబైల్ ఉపయోగించరు పిల్లలు. అలాగే మొబైల్ కి పాస్వర్డ్ అనేది తరచూ మారుస్తూ ఉండాలి.
పిల్లలకు మొబైల్ ఇవ్వడం కంటే బహిరంగ ఆటలు లేదా కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడం ఉత్తమం.. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా ఉండడమే కాకుండా చురుకుగా కూడా ఉంటారట.
పిల్లలు మొబైల్ తీసుకున్న వెంటనే వారి చేతిలో నుంచి లాగుకోకండి నెమ్మదిగా వాటి గురించి వివరించి మొబైల్ తీసుకోవడం మంచిది.
ఎక్కువ సమయం దొరికినప్పుడు పిల్లలకు టీవీ చూపించడం లేదా పుస్తకాలు చదివించడం డాన్స్ నేర్పించడం ఇతరత్రా వాటిలలో యాక్టివ్ గా ఉండేలా చేయాలి.