ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. ఈ క్రమంలోనే అన్ని రంగాల్లో కూడా అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వినూత్నమైన టెక్నాలజీ ఎన్నో రకాల మార్పులకు కారణం అవుతుంది. ఒకప్పటితో పోల్చి చూస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో సర్జరీలను సైతం సులభంగా చేస్తూ ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టగలుగుతున్నారు వైద్యులు.


 కాగా ఈ మధ్యకాలంలో ఇలా వైద్యరంగంలో అందుబాటులోకి వస్తున్న వినూత్నమైన టెక్నాలజీ చూసి.. ప్రతి ఒక్కరు కూడా నోరేళ్ల బెడుతున్నారు అని చెప్పాలి. ఒకప్పుడు ఎవరైనా పేషంట్ ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఎన్నో రకాల పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండేది. ఇక ఒక్కో వ్యాధికి ఒక్కో రకమైన పరీక్ష చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు కేవలం అతి తక్కువ సమయంలోనే ఎంతో సులభంగా ఒక పేషెంట్  ఏ వ్యాధితో బాధపడుతున్నారు అన్న విషయాన్ని టెక్నాలజీ సహాయంతో ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు వైద్య నిపుణులు.


 ఇలాగే ఏకంగా నిమిషాల వ్యవధిలో రోగి యొక్క వ్యాధిని నిర్ధారించే సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది. ప్రాథమిక దశలోనే రోగి వ్యాధిని నిర్ధారించడం ప్రతి పేషెంట్ విషయంలో ఎంతో ముఖ్యం. ఈ నేపద్యం లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి హెల్త్ అకౌస్టిక్స్ రిప్రజెంటేషన్ అనే టెక్నాలజీనీ గూగుల్ రూపొందించింది. ఇది దగ్గు ధ్వని నమూనా ఆధారంగా శరీర అంతర్గత సమస్యలను విశ్లేషిస్తుంది. హైదరాబాద్ బెస్ట్ కంపెనీ రూపొందించిన శ్వాస అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరానికి HeAR ను గూగుల్ అనుసంధానం చేసింది. దీంతో టీబి, సిఓపిడి  లాంటి లంగ్ సంబంధిత వ్యాధులను వేగంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: