నేటి రోజుల్లో మనిషి జీవనశైలిలో ఎంతలా మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి విషయంలో కూడా సులభమైన దారిని వెతుక్కోవడంలో మనిషి బిజీ బిజీగా ఉన్నాడు  ఒకప్పుడు చెమటోడ్చి కష్టపడిన మనిషి.. ఇక ఇప్పుడు ఏ పని చేయడానికి అయినా టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాడు. ప్రతి పనిని టెక్నాలజీని ఉపయోగించుకొని సులభతరం చేసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. చెమట చుక్క చిందకుండానే అన్ని పనులను కూడా పూర్తి చేయగలుగుతున్నాడు.


 అయితే కేవలం చేసే పని విషయంలో మాత్రమే కాదు.  తినే ఆహారం విషయంలో కూడా మనిషి ఆలోచన తీరు ఇలాగే మారిపోయింది. ఒకప్పుడు కాస్త సమయం కేటాయించి అయినా సరే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అనుకునేవారు ప్రతి ఒక్కరు. కానీ ఇప్పుడు అసలు మనిషికి ఆరోగ్యం గురించి ఆలోచించుకునే సమయం లేదు. దీంతో ఏది పడితే అది తినేయడం.. ఏది పడితే అది తాగడం చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు జ్యూస్ తాగాలి అనిపిస్తే షాప్ కి వెళ్లడం అటు ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ లు తాగడం చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగే వారిని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 సాధారణంగా వైద్య నిపుణులు పండ్ల రసాలు తాగితే ఆరోగ్యానికి మంచిది అని చెబుతూ ఉంటారు. ఇక వైద్యులు చెప్పారు కదా అని ఇన్స్టంట్ గా దొరికే ప్యాక్ చేసిన వాటిని తాగుతూ ఉంటారు చాలామంది. అయితే ఇలాంటివి తాగితే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు  ఒక లీటర్ నారింజ రసం ప్యాకెట్ 135 గ్రాముల చక్కెర ఉంటుందని.. ఇది 560 కిలో క్యాలరీలకు సమానమని వైద్యులు చెబుతున్నారు. జ్యూస్ లో ఉండే పోషకాలు నిల్వ చేసిన తర్వాత క్షీణిస్తాయని.. తాజాగా ఉన్నప్పుడే సేవించాలని సూచించారు. పండ్లు ఆరోగ్యకరమని సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: