ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు ఆ మనిషినే బానిసగా మార్చేసి ఆడుకుంటుంది. అధునాతన టెక్నాలజీతో కూడిన మొబైల్ ఫోన్స్ ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయ్. ఇక ఆ మొబైల్స్ లోనే కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నాడు మనిషి. దీంతో ఇక చివరికీ బయట ప్రపంచంతో అవసరమే లేకుండా పోయింది అని చెప్పాలి.


 ఇక ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్న ప్రతి ఒకరి అరచేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఒక్క క్షణం పాటు చేతిలో మొబైల్ లేకపోయినా ఎంతో మంది ఏదో కోల్పోయినట్లుగా దిగాలుగా ఉండిపోతున్నారు. అంతలా మొబైల్ కి బానిసగా మారిపోయారు మనుషులు. చివరికి బాత్రూం కి వెళ్లే టైం లో కూడా మొబైల్ తీసుకువెళ్తూ ఉండడం నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాము. ఎంతోమంది ఇలా బాత్ రూమ్ కి వెళ్లి ఏకంగా అక్కడ కూడా మొబైల్ వాడే అలవాటును చేసుకుంటున్నారు. అయితే ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.


 అయితే ఇలా మొబైల్ ఫోన్ ను బాత్రూంలోకి తీసుకెళ్లే  అలవాటు ఉన్నవారు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే అంటూ నిపుణులు చెబుతున్నారు  మొబైల్ ఫోన్ ని బాత్రూం లోకి తీసుకువెళ్లి వాడి అలవాటు ఉన్న కారణంగా రెండు నిమిషాల్లో ముగించాల్సిన కాలకృత్యాన్ని అరగంట సేపు చేస్తున్నారు. అయితే ఇలా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మల ప్రాంతం లోని సిరలపై ఒత్తిడి పెరుగుతుందని టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఒక శాస్త్రవేత్త చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఫోన్ చూస్తూ సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల. మలబద్ధకం పైల్స్ లాంటి సమస్యలు వస్తాయని తమ నివేదికలో తేలిందని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: