దానిమ్మ ఆకులు ఆయుర్వేదంలో చాలా ప్రత్యేకమైనవి. చర్మ వ్యాధులకు, ముఖ్యంగా కుష్టు వ్యాధికి చికిత్స చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. అంతేకాకుండా, ఈ ఆకులతో కాషాయం చేసి రోజుకు రెండుసార్లు తాగితే, వేసవి, చలికాలాల్లో వచ్చే దగ్గు, జలుబు లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. నిద్రలేమి సమస్య ఉన్నవారికి దానిమ్మ ఆకుల పేస్ట్‌తో తయారు చేసిన ఒక అద్భుతమైన మందు ఉంది. మూడు కప్పుల నీటిలో దానిమ్మ ఆకుల పేస్ట్‌ వేసి, అది సగం అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని ప్రతి రాత్రి నిద్రించే ముందు తాగితే, నిద్ర బాగా పడుతుంది.

చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి దానిమ్మ ఆకులు ఒక వరం లాంటివి. గజ్జి, చుండ్రు వంటి చర్మ సమస్యలు ఉన్నవారు దానిమ్మ ఆకుల పేస్ట్‌ను చర్మంపై రాసుకుంటే త్వరగా కోలుకుంటారు. అంతేకాకుండా, శరీరంలో ఏర్పడిన పుండ్లు కూడా త్వరగా మానిపోతాయి. చెవి నొప్పి లేదా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నవారు దానిమ్మ ఆకుల రసాన్ని తీసి, అందులో నువ్వుల నూనె లేదా ఆముదం కలిపి, రెండు చుక్కలను ప్రతి చెవిలో వేసుకోవచ్చు. ఇలా చేస్తే చెవి నొప్పి తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. నోటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి దానిమ్మ ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నోరు దుర్వాసన, చిగుళ్ళ సమస్యలు, నోటిలో పుండ్లు వంటి సమస్యలు ఉన్నవారు దానిమ్మ ఆకుల రసాన్ని నీటిలో కలిపి నోటిని శుభ్రం చేసుకుంటే చాలు. ఇది నోటి సమస్యలను నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

ముఖం మీద మొటిమల సమస్య ఉన్నవారు దానిమ్మ ఆకుల పేస్ట్‌ను మొటిమల మీద రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. అజీర్తి, మలబద్ధకం, గ్యాస్, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటే, రోజుకు రెండు స్పూన్ల దానిమ్మ ఆకుల రసాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు, ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం. ఇవి సాధారణంగా సురక్షితమైనవే అయినప్పటికీ, అలర్జీలు లేదా ఇతర సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: