నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవనశైలిలో ఎన్ని రకాల మార్పులు వచ్చాయో అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి విషయంలో కూడా టెక్నాలజీ మీద ఆధారపడిపోతున్నారు. అయితే నేటి రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా స్మార్ట్ గాడ్జెట్ లు అందుబాటులో ఉన్నాయి. కూరగాయలను ఎప్పటికీ తాజాగా ఉంచుకోవడం కోసం రిఫ్రిజిరేటర్లు, నీటిని శుద్ధి చేయడం కోసం వాటర్ ప్యూరిఫైయర్లు.. పిండిని రుబ్బడం కోసం మిక్సర్ గ్రైండర్లు అన్నం వండుకోవడం కోసం.. రైస్ కుక్కర్ లు ఇలా అన్ని స్మార్ట్ గ్యాడ్జెట్ లు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 దీంతో ఒకప్పటిలా వంటలు చేయడానికి గాని లేదంటే పిండి రుబ్బడానికి కానీ ఎవరు పెద్దగా కష్టపడటం లేదు.. కేవలం నిమిషాల వ్యవధిలోని అన్ని పనులను పూర్తి చేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో చేస్తున్న కొన్ని కొన్ని తప్పులు మాత్రం చివరికి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అటు రిఫ్రిజిరేటర్ లో ఆహారంగాని లేదంటే కూరగాయలు గానీ ఎప్పుడూ తాజాగా ఉంటాయని అందరూ నిల్వ చేస్తూ ఉంటారు. కానీ ఇలా నిలువ చేయడం విషయంలో కొన్ని పొరపాట్లు చేయడం కారణంగా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు.


 చాలామంది ఉల్లిపాయలు కోసే సమయంలో ఒకవేళ కోసిన ఉల్లిపాయ ముక్క మిగిలిపోతే దానిని కూడా ఫ్రిడ్జ్ లో ఉంచడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా తరిగిన లేదా ఒలిచిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్ లో ఉంచడం ప్రమాదకరం అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతుందట. తద్వారా ఫ్రిడ్జ్ లోని ఇతర పదార్థాలకు బ్యాక్టీరియా వ్యాపిస్తుందట. ఇది రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. కట్ చేసిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్ లో పెడితే చేదుగా మారి టేస్ట్ కూడా పోతుందట. అందుకే అప్పటికప్పుడు కట్ చేసిన తాజా ఉల్లిపాయలను మాత్రమే వంటకాలలో ఉపయోగించాలని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: