కొన్నేళ్ల క్రితం చాలామంది విపరీతంగా పామాయిల్ వాడేవారు. ఇది చాలా తక్కువ ధరకు రావడం వల్ల ప్రతి ఒక్కరూ దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపించేవారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా సన్ ఫ్లవర్ ఆయిల్ నీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. తద్వారా గుండె పనితీరు మెరుగు పడుతుంది.


గుండె సంబంధ వ్యాధులు తొలగి పోతాయని చెబు తున్నారు. పామాయిల్ లో కొవ్వు పదార్థాలు అధికంగా ఉండడం వల్ల దాని ప్రభావం ముఖ్యంగా గుండె, కాలేయం పైన పడుతుంది. ముఖ్యంగా పామాయిల్ ను ఆహార పదార్థాలలోనూ, సౌందర్య వస్తువులలో, గృహోపకరణాల్లో ఎక్కువగా పామాయిల్ ని వాడుతారు. పామాయిల్ అనేది పామ్ పండ్ల నుంచి తీసే ఒక రకమైనటువంటి కూరగాయ నూనె. దీనిని ప్రాసెసింగ్ చేసి అనేక రకాల రకాలుగా వాడుతారు.


ఇందులో సంతృప్త కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. సుమారు 50 శాతం వరకు సంతృప్త కొవ్వులు ఈ నూనెలో ఉంటాయి. అందువల్ల దీనిని ఉపయోగిస్తే శరీరంలో ఎల్డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దాని కారణంగా గుండె జబ్బులు, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం విపరీతంగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన పామాయిల్ లో సంభావ్య ట్రాన్స్ ఫ్యాట్లు ఉంటాయి. దీని కారణంగా గుండెలో మంట, ఇన్సులిన్ నిరోధకత, గుండె జబ్బులతో సహా అనేక రకాల సమస్యలు వస్తాయి.

అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ నూనెను ప్రాసెస్ చేయడం వల్ల ఇందులో ఆరోగ్యానికి హాని కలిగించే కలుషితాలు ఉత్పత్తి అవుతాయి. తద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. అందువల్లనే పామాయిల్ నూనెను అస్సలు వాడకూడదని, కేవలం సన్ ఫ్లవర్ నుంచి తీసిన నూనెను మాత్రమే వాడాలని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: