నేటి రోజుల్లో ఆరోగ్య చిట్కాలను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఆరోగ్యం అంటే పట్టింపు లేని వారి సైతం కరోనా వైరస్ తర్వాత తీరును మార్చుకున్నారు. ఆరోగ్యం కంటే ఇక మహాభాగ్యం మరొకటి లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు మనిషి ప్రాణాలను నిలబెట్టలేదు అన్న విషయాన్ని కరోనా టైంలో ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోగలిగాడు.


 అందుకే ఇక ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. ఒకవేళ వ్యాయామం చేసే టైం లేకపోతే ఇక ఏదో ఒక విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చేస్తూ ఉన్నారు. అయితే ఇక ఎలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటాము అనే విషయంపై డాక్టర్ల సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారు. ఇంకొంతమంది సోషల్ మీడియాలో వచ్చే చిట్కాలను ఫాలో అవుతూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ప్రతిరోజు ఆహారంలో ఉడకబెట్టిన గుడ్డుని భాగం చేసుకుంటే ఇక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకున్నట్లే అని వైద్యులు చెబుతూ ఉంటారు.


 చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కూడా గుడ్డు ఎంతో మేలు చేస్తుందని చెబుతూ ఉంటారు. అయితే మరీ ముఖ్యంగా మహిళలకు ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట. ఎగ్స్ తినే మహిళల్లో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందని న్యూట్రియన్స్ జర్నల్లో పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ పేర్కొంది. వారంలో ఐదు లేదా అంతకుమించి ఎక్కువ గుడ్లు తినే వారిలో కాగ్నిటివ్ ఆలైన్ అర పాయింట్ తగ్గినట్లు తెలిపింది. వృద్ధ మహిళలలో ఆ ప్రభావం ఎక్కువగా ఉందని సైంటిస్టులు అంటున్నారు. గుడ్డులోని ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, జియాక్సన్ తైన్, లూటీన్ వంటి కెరోటిక్స్ బ్రెయిన్ హెల్త్ కి ఎంతగానో మెయిల్ చేస్తాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: