నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎంత బిజీ అయిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరికీ కూడా కనీసం ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయమే లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. డబ్బు సంపాదించాలి వృద్ధిల్లోకి రావాలి అనే ఆలోచనతో ఆరోగ్యం విషయాన్ని పూర్తిగా వదిలేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టైం కి ఏది పడితే అది తినడం ఇక రోజు ఉరుకుల పరుగుల జీవితంలో పనులు చేసుకోవడం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే కరోనా వైరస్ తర్వాత మాత్రం చాలా మందిలో మార్పు వచ్చింది. ఒకప్పుడు డబ్బు వెంట పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని అలసత్వం చేసిన వాళ్ళు సైతం కరోనా తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరోసారి అర్థం చేసుకున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా వంటింటి చిట్కాలను పాటించి ఆరోగ్యాన్ని మరింత పదిలంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా కారణంగా ఎన్నో వంటింటి చిట్కాలు ఇలా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 సాధారణంగా బెండకాయను తరచు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల హెల్త్ కి ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు వైద్యులు. అయితే కేవలం కూర వండుకొని తినడం మాత్రమే కాదు ఇక బెండకాయ నీటిని తాగిన కూడా చాలా మంచిదట. రాత్రంతా బెండకాయలు నానబెట్టిన నీటిని తాగితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని న్యూట్రీషియనిష్టులు చెబుతున్నారు. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుందట. వేగంగా కలిసిపోయే ఫైబర్ వల్ల డైజేషన్ కూడా మెరుగవుతుందట. పొట్ట బరువు తగ్గేందుకు సహాయపడుతుందట. యాంటీ ఆక్సిడెంట్లతో, కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం కూడా బాగుంటుందట. విటమిన్ ఏ, సి వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గి ఇమ్యూనిటీ పెరుగుతుందట. ఇక చర్మం కూడా నివారిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: