ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఎంత వనికించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా అప్పటివరకు స్వేచ్ఛగా తిరిగిన ప్రతి మనిషి కూడా ముసుగు చాటుకు వెళ్లిపోయి బిక్కు బిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితిని తీసుకువచ్చింది. ఇక కనిపించని శత్రువుతో ప్రపంచం మొత్తం యుద్ధం చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ప్రాణాంతకమైన కారణం వైరస్ ను తిప్పి కొట్టడంలో సక్సెస్ అయింది. ఇక ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అని చెప్పాలి.


 ఇలా ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తున్న సమయం లో అందుబాటు లోకి వచ్చిన వ్యాక్సిన్ ఇక పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చింది అని చెప్పాలి. అయితే అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకొని ఇప్పటికీ కరోనా వైరస్ తో పోరాటం చేస్తూనే ఉన్నారు. కాగా ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గింది అనుకుంటున్నా సమయం లో మరో ప్రాణాంతకమైన వైరస్ ప్రపంచ దేశాలని వనికిస్తుంది. గత కొన్ని రోజులు నుంచి మంకీ ఫాక్స్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే ఈ వైరస్ కు అటు ఇలాంటి వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు.


 అయితే ఇక భయ పడాల్సిన పనిలేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ ఫాక్స్ వైరస్ కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలి వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బవేరియన్ నార్దిక్ సంస్థ తయారుచేసిన ఎంవిఏ బి న్ వ్యాక్సిన్ నూ వాడొచ్చు అంటూ డబ్ల్యూహెచ్ఓ తెలుపుతుంది. అటు ఆఫ్రికాలో ఈ వైరస్ మరణ మృదంగం మోగిస్తుంది. గతవారం మంకీ బాక్స్ తో 107 మంది మరణించగా.. 3160 కొత్త కేసులు నమోదయినట్లు అక్కడి అధికారులు చెప్పుకొచ్చారు. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఎంతో దోహద పడుతుంది అంటూ చెప్పుకొచ్చింది డబ్ల్యూహెచ్వో.

మరింత సమాచారం తెలుసుకోండి: